- Telugu News Photo Gallery Can you get cancer if you use nail polish? Find out now, check here is details in Telugu
Nail Polish Effects: నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా.. ఇప్పుడు తెలుసుకోండి!
అమ్మాయిలు అందంగా కనిపించడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు నుంచి.. చేతి గోర్ల వరకు తమ అందాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇలా గోర్లను సైతం అందంగా కనిపించేలా చేయడంలో నెయిల్ పాలిష్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల నెయిల్ పాలిష్‌లు మార్కెట్లు సులభంగా లభ్యమవుతున్నాయి. అయితే నెయిల్ పాలిష్‌లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని తరచూ వినియోగిస్తే.. నెయిల్ కలర్ పాడవుతుంది. జెల్ నెయిల్ పాలిష్‌ను..
Updated on: May 16, 2024 | 6:27 PM

అమ్మాయిలు అందంగా కనిపించడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు నుంచి.. చేతి గోర్ల వరకు తమ అందాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇలా గోర్లను సైతం అందంగా కనిపించేలా చేయడంలో నెయిల్ పాలిష్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల నెయిల్ పాలిష్‌లు మార్కెట్లు సులభంగా లభ్యమవుతున్నాయి.

అయితే నెయిల్ పాలిష్‌లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని తరచూ వినియోగిస్తే.. నెయిల్ కలర్ పాడవుతుంది. జెల్ నెయిల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి ఉపయోగించే యూవీ కిరాణాల వల్ల చర్మ క్యాన్సర్, వృద్ధాప్యం పెరుగుతాయి.

కాబట్టి ముందుగా జెల్ మేనిక్యూర్ ఉపయోగించే ముందు వేళ్లపై సన్ స్క్రీన్‌ను అప్లై చేయడం మంచిది. రసాయనాలతో నెయిల్ పాలిష్‌ను తొలగించడం వల్ల మీ గోర్లు గరుకుగా మారతాయి. గోళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు.. నోటి ద్వారా ప్రవేశించి అనారోగ్య సమస్యల్ని తెచ్చి పెడుతుంది.

నెయిల్ పాలిష్‌ని ఎక్కువగా ఉపయోగించడకూదు. వేటిని పడితే వాటితో గోళ్ల రంగుని రిమూవ్ చేయకూడదు. యూవీ లైట్లకు బదులుగా ఎల్ఈడీ క్యూరింగ్ టైట్లను ఉపయోగించే సెలూన్‌కి వెళ్లడం మంచిది. ఎల్ఈడీ లైట్లు కూడా మీ గోళ్ల రంగును వేగంగా నయం చేస్తుంది.

ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే నెయిల్ పాలిష్‌ను ఉపయోగించండి. ప్రతి రోజూ గోర్ల రంగును ఉపయోగించ కూడదు. ఎందుకంటే గోర్లు కూడా తమను తాము రిపేర్ చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. అలాగే తక్కువ రసాయనాలు కలిగిన బ్రాండ్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.





























