- Telugu News Photo Gallery Can drinking alcohol increase your blood sugar levels? Know what experts say
Alcohol for Diabetes: డయాబెటిస్ పేషెంట్లు మద్యం సేవిస్తే బ్లడ్ షుగర్ పెరుగుతుందా?
మందు చుక్క లేకుండా ఏ పార్టీ ఉండదు. అసలు మద్యం మాటిల్ కనినించకపోతే ఆ పార్టీ అసంపూర్తిగా ఉన్నట్లు ఫీలయ్యే జనాల మధ్యలో బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒంట్లో ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను పట్టించుకోకుండా పార్టీ మాయలో పడి మద్యం తాగారో మీ ఆరోగ్యం చేతులారా గుల్లవడం ఖాయం..
Updated on: Jan 03, 2025 | 1:06 PM

మద్యం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో అదరికీ తెలిసిందే. ఇది కాలేయం, నిద్ర, బరువును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆల్కహాల్ సేవిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఒక్కో సందర్భంలో ఒకటి లేదా రెండు పెగ్గులు మాత్రమే తీసుకున్నా పెద్దగా ఏం కాదులే అనుకుంటాం. కానీ ఆల్కహాల్ ఒక్క చుక్కైనా ప్రమాదమేనట.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, మన శరీరం దానిని విషంగా గుర్తిస్తుంది. అందుకే ఇతర కార్యకలాపాల కంటే ఆల్కహాల్ ప్రాసెస్ చేయడానికి శరీరం కష్టపడుతుంది. ఇది ఒంట్లోకి ప్రవేశించిన వెంటనే జీవక్రియ అస్తవ్యస్తం అవుతుంది.

ఆల్కహాల్‌ను జీవక్రియ చేయడానికి, శరీరానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, బ్లడ్ షుగర్‌లో స్పైక్‌ను చూపిస్తుందేతప్ప తగ్గుదల అస్సలు సాధ్యంకాదు.

ఎందుకంటే ఆల్కహాల్‌ను జీవక్రియ చేయడానికి గ్లూకోజ్ ఉపయోగించబడుతుంది. ఆల్కహాల్‌తో కాక్‌టెయిల్‌లు లేదా చక్కెర మిక్సర్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం మరింత పెరుగుతుంది.

ఆరోగ్యానికి ఆల్కహాల్ అస్సలు సురక్షితం కాదు. WHO, లాన్సెట్ విడుదల చేసిన 2023 నివేదిక ప్రకారం.. కాలేయం, సిర్రోసిస్, గుండె జబ్బులతో సహా ఇతర నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల వంటి వివిధ రుగ్మతలన్నింటికీ ఆల్కహాల్ ప్రధాన కారణం. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.




