- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS: Virat Kohli Out by Scott Boland in Sydney Test with worst shot
Virat Kohli: లైఫ్ వచ్చినా ఏం ఉపయోగం కోహ్లీ భయ్యా.. మరోసారి అదే రీతిలో ఔట్.. కెరీర్ ఖేల్ ఖతం..?
IND vs AUS: సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎవరి బౌలింగ్‌లో లైఫ్ వచ్చిందో.. అదే బౌలర్‌కి విరాట్ బలి అయ్యాడు. దీంతో రోహిత్ లాగే కోహ్లీని కూడా బెంచ్‌కే పరిమితం చేయాలని వార్తలు వినిపిస్తున్నాయి.
Updated on: Jan 03, 2025 | 12:07 PM

ఇన్నింగ్స్ తొలి బంతికే లైఫ్ అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లి.. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడనిపించింది. కానీ, అలా జరగలేదు. ఆ లైఫ్ తర్వాత విరాట్ కోహ్లి చాలా సేపు క్రీజులో నిలదొక్కుకునేందుకు ట్రై చేశాడు. రెండో సెషన్‌లో అదే బౌలర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఈ విధంగా సిడ్నీ టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలన్న విరాట్ కోహ్లీ ఆశలు అడియాసలు కాగా, మరోసారి టీమిండియాకు ఘోర పరాజయం తప్పేలా లేదు.

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 69 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ వికెట్‌ను స్కాట్ బోలాండ్ తీశాడు. బోలాండ్ వేసిన బంతికి విరాట్ అందించిన క్యాచ్‌ను ఈ టెస్టులో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ థర్డ్ స్లిప్ వద్ద క్యాచ్ అందుకున్నాడు. జీరో వద్ద లైఫ్ అందిపుచ్చుకున్న తర్వాత, విరాట్ తన స్కోరుకు 17 పరుగులు మాత్రమే జోడించగలిగాడు.

సిడ్నీ టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు విరాట్ తన 8 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు ఇదే రీతిలో ఔటయ్యాడు. నిజానికి, సిడ్నీలో కూడా, అతను అవుట్‌గోయింగ్ బాల్‌ను ఆడే క్రమంలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఇది కోహ్లీకి సర్వసాధారణంగా మారింది.

రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడలేదు. ఇటువంటి పరిస్థితిలో, జట్టులోని అత్యంత సీనియర్ ఆటగాడిగా విరాట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఆ ఆశ సన్నగిల్లింది. విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు గిల్‌తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ వ్యక్తిగతంగా అతను పెద్దగా సహకారం అందించలేకపోయాడు. విరాట్ కోహ్లీ కూడా తన వికెట్ కోల్పోయి టీమ్ ఇండియాను కష్టాల్లో పడేశాడు. అతను ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 4 వికెట్లకు 72 పరుగులుగా నిలిచింది.

ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. క్రీజులో సిరాజ్, బుమ్రా ఉన్నారు. 40 పరుగులతో రిషబ్ పంత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత గిల్ 20, జడేజా 26 పరుగులతో నిలిచారు. మిగ ప్లేయర్లు ఎవరూ 20 పరుగులను చేరుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు, బోలాండ్ 4 వికెట్లు, కమిన్స్, నాథన్ లయిన్ తలో వికెట్ పడగొట్టారు.




