- Telugu News Photo Gallery Business photos These bikes have high mileage at a low price, these are the top bikes that have stolen the minds of middle class people, Affordable Bikes details in telugu
Affordable Bikes: తక్కువ ధరలో అధిక మైలేజ్ ఆ బైక్స్ సొంతం.. మధ్యతరగతి ప్రజల మనస్సు దోచుకున్న టాప్ బైక్స్ ఇవే
భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధరలో అధిక మైలేజ్‌నిచ్చే బైక్స్‌ను మధ్యతరగతి ప్రజలు ఆదరిస్తున్నారు. ఏళ్లుగా నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే బైక్‌ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హీరో, టీవీఎస్, హెూండా, బజాజ్ వంటి కంపెనీల బైక్స్ భారతదేశంలో అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ప్రజల ఆదరణ పొందిన టాప్ బడ్జెట్ బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Aug 13, 2024 | 5:00 PM

హెూండా లివో రూ.78,650 (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ రెండు వేరియంట్లు, మూడు రంగులలో లభిస్తుంది. 8.67 బీహెచ్‌పీ, 9.30 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే 109.51 సీసీ బీఎస్ 6 ఇంజిన్‌తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్లతో వచ్చే ఈ బైక్ బరువు 113 కిలోలు. ముందువైపు సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లతో యువతను ఈ బైక్ అమితంగా ఆకట్టుకుంటుంది.

హీరో స్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ రూ. 79,911 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ రెండు వేరియంట్లు, ఐదు రంగులలో లభిస్తుంది. 7.9 బీహెచ్‌పీ, 8.05 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 97.2 సీసీ బీఎస్ 6 ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. ఈ బైక్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చే ఈ బైక్ స్క్రీన్‌పై బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని కాల్, ఎస్ఎంఎస్ అలెర్ట్‌లను చూడవచ్చు.

టీవీఎస్ రెడాన్ బైక్ రూ. 62,630 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. 110 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ 8.08 బీహెచ్‌పీ శక్తిని 8.7 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా పని చేసే ఈ బైక్ 69.3 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టీవీఎస్‌కు సంబంధించిన సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో వచ్చే ఈ బైక్‌లో బీపర్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌తో వస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంటుంది. 124.7 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 66 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో వచ్చే ఈ బైక్ బరువు 136 కిలోలు. ఈ బైక్ మూడు రంగులలో అందుబాటులో ఉంది. ఫైర్ స్టార్మ్ రెడ్, కోబాల్ట్ బ్లూ, స్టాలియన్ బ్లాక్ కొనుగోలుదారులను అమితంగా ఆకర్షిస్తుంది.

హీరో సెండర్ ప్లస్ బైక్ రూ. 75,441 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ నాలుగు వేరియంట్లు, ఏడు రంగులలో లభిస్తుంది. ఈ బైక్ 8,000 ఆర్‌పీఎం వద్ద 7.91 బీహెచ్‌పీ, 6,000 ఆర్‌పీఎం వద్ద 8.05 ఎన్ఎం శక్తిని అందిస్తుంది. హీరోకు సంబంధించిన ఎక్స్ సెన్స్ టెక్నాలజీతో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఆకర్షిస్తుంది. ఐ3 ఎస్ ద్వారా పని చేసే ఈ బైక్ బ్లాక్, యాక్సెంట్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.




