- Telugu News Photo Gallery Business photos The best budget cars in India, These are the best cars, Budget Cars details in telugu
Budget Cars: భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
భారతదేశంలో పండుగల సీజన్ మొదలైంది. ఈ పండుగల సీజన్‌లో చాలా మంది కొత్త వస్తువులు కొంటూ ఉంటారు. ముఖ్యంగా వాహన కొనుగోలు ఈ సీజన్ మంచిదని భావించి చాలా మంది కార్లు కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి ఆకర్షించేందుకు చాలా కంపెనీలు కూడా పండుగ ఆఫర్లను పెడుతూ ఉంటాయి. ఆఫర్ల సంగతి పక్కన పెడితే భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. అందువల్ల కార్ల కొనుగోలు సమయంలో కచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లనే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో రూ.10 లక్షల్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన బడ్జెట్ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Sep 28, 2024 | 3:30 PM

మారుతి సుజుకి ఆల్టో కే10 చిన్న ఎంట్రీ-లెవల్ కారు. ఈ కారు సిటీ డ్రైవ్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ కారును హైవేలు, కొండల పై కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఆల్టో కే10 ఫీచర్-ప్యాక్డ్, భారీ పనితీరు కనబరిచే కారు కాకపోయినా చిన్న కుటుంబాలకు అనువుగా ఉంటుంది. ఈ మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారికి ఇది మంచి కారు అని నిపుణులు చెబుతున్నారు.

హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యూవీ అనేక రకాల క్లాస్ లీడింగ్ ఫీచర్లతో భారతదేశంలో కారును ప్రారంభించినప్పుడు అనేక ముఖ్యాంశాలతో వస్తుంది. ఈ ఎస్‌యూవీ పుష్కలంగా ఫీచర్లు, బహుళ పవర్ యిన్ ఎంపికలతో వస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంది. ఈ కారును ప్రజలు బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా ప్రజల ఆదరణ పొందుతున్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ వల్ల ఈ కారు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కారు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఎంజీ కామెట్ ఈవీ కారును మీరు పది లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈవీల యాజమాన్యం వాటి ఐసీఈ కౌంటర్ పార్టీతో పోలిస్తే గణనీయంగా తక్కువ ధర అని నిపుణులు చెబుతున్నారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లల్లో ఒకటి. బడ్జెట్ కార్ల విషయంలో ఈ కారు దశాబ్దాలుగా మొదటి స్థానంలో ఉంది. స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్ కొన్ని నెలల క్రితం ప్రారంభించారు. కొత్త డిజైన్, విస్తృత శ్రేణి ఫీచర్లు, ఇంజిన్‌ను కూడా పూర్తిగా అప్ గ్రేడ్ చేశారు. మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పుడు నాలుగు సిలిండర్ల పెట్రోల్ మోటార్‌కు బదులుగా మూడు సిలిండర్ల ఇంజిన్‌తో వస్తుంది. అలాగే స్విఫ్ట్ సీఎన్‌జీ పవర్ ట్రెయిన్ కూడా అందుబాటులో ఉంది.

టాటా పంచ్ అనేది సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు భారతదేశంలో ప్రారంభించిన తర్వాత తక్కువ వ్యవధిలో చాలా ప్రజాదరణ పొందింది. పంచ్ పెట్రోల్, పెట్రోల్ సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. ఈ కారును కూడా 10 లక్షల లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు.





























