- Telugu News Photo Gallery Business photos Spicejet announces mega monsoon sale domestic airfares start from 999 rupees
Spicejet Offer: విమాన ప్రయాణికులకు శుభవార్త.. స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్ ఆఫర్
Spicejet Offer: విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది స్పైస్ జెట్. బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్‌ను ప్రారంభించింది. దీని కింద వివిధ దేశీయ గమ్యస్థానాలకు ..
Updated on: Jun 25, 2021 | 1:01 PM

Spicejet Offer: విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది స్పైస్ జెట్. బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్‌ను ప్రారంభించింది. దీని కింద వివిధ దేశీయ గమ్యస్థానాలకు 999 రూపాయల నుంచి విమాన ప్రయాణ సేవలు అందించనుంది.

అయితే విమానయాన సంస్థ ఉచిత విమాన వోచర్లను అందిస్తోంది. స్పైస్ జెట్ వెబ్ సైట్ లో ప్రత్యక్ష టికెట్ల బుకింగ్ లో ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.

జూన్ 25వ తేదీ నుంచి ప్రయాణికులకు ఆఫర్లు లభిస్తాయి. జులై 1 నుంచి 31 వరకు, ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వతేదీల మధ్య ప్రయాణానికి ఉచిత వోచర్ల బుకింగ్ చెల్లుబాటు అవుతుంది.

ఈ ఆఫర్ వన్ వే రిటైల్ చార్జీలపై ఉంటుంది. దేశీయ విమాన సర్వీసులపై రాయితీలు ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది. ఈ ఆఫర్లతో ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని కంపెనీ తెలిపింది.





























