- Telugu News Photo Gallery Business photos Shares of seven companies in the Adani group are again gains for LIC
Adani Group Shares: అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లు ఎల్‌ఐసీకి మళ్లీ లాభాలు
అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లు ఎల్‌ఐసీకి మళ్లీ లాభాలు కురిపిస్తున్నాయి. బుధవారం ఈ ఏడు కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసినా ఇటీవల ర్యాలీ కారణంగా వాటిలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ మాత్రం రూ.44,670 కోట్లకు చేరింది..
Updated on: May 26, 2023 | 6:57 AM

అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లు ఎల్‌ఐసీకి మళ్లీ లాభాలు కురిపిస్తున్నాయి. బుధవారం ఈ ఏడు కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసినా ఇటీవల ర్యాలీ కారణంగా వాటిలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ మాత్రం రూ.44,670 కోట్లకు చేరింది.

ఎల్‌ఐసీ అసలు పెట్టుబడి విలువ రూ.30,127 కోట్లు తీసేస్తే, ఈ షేర్లలో ఎల్‌ఐసీ ఇప్పటికీ రూ.14,543 కోట్ల లాభాల్లో ఉంది. ఇందులో రూ.5,500 కోట్ల లాభం, గత రెండు నెలల్లోనే సమకూరింది.

నిజానికి ఈ ఏడాది జనవరి 27 నాటికి ఏడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.56,142 కోట్లు. హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక దెబ్బతో ఫిబ్రవరి 23 నాటికి అది రూ.27,000 కోట్లకు పడిపోయింది.

అపుడు సరైన ముందు జాగ్తత్త లేకుండా గుడ్డిగా అదానీ కంపెనీల షేర్లలో మదుపు చేశారని ఎల్‌ఐసీపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

అదానీ గ్రూపు షేర్లు మళ్లీ లాభాల బాట పట్టడంతో ఆ విమర్శలకు తెరపడుతోంది. అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లు ఎల్‌ఐసీకి మళ్లీ లాభాలు తెచ్చి పెడుతున్నాయి.




