- Telugu News Photo Gallery Business photos PM Kisan Yojana: Can both husband and wife take Rs 6,000 instalment? Check full details
PM Kisan Yojana: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందగలరా..? మరి ఖాతాలో నగదు జమ అయితే..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సాహసోపేతమైన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఒకటి. రైతుల సంక్షేమమే థ్యేయంగా, పెట్టుబడికి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిని 2019లో ప్రారంభించగా..
Updated on: May 25, 2023 | 1:40 PM

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సాహసోపేతమైన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఒకటి. రైతుల సంక్షేమమే థ్యేయంగా, పెట్టుబడికి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిని 2019లో ప్రారంభించగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలో సంవత్సరానికి 6,000 చొప్పున జమఅవుతుంది. ఈ డబ్బు మొత్తం మూడు విడతలుగా బదిలీ అవుతుంది.

అయితే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు ప్రభుత్వం.. 13 విడతలను రైతులకు అందజేసింది. ప్రస్తుతం రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నగదు వచ్చే నెలలో జమ అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

PM కిసాన్ యోజన పథకానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజనను భార్యాభర్తలు ఇద్దరూ పొందగలరా..? లేదా..? అనే ప్రశ్న చాలా సార్లు లబ్ధిదారుల మదిలో తలెత్తుతుంది. ఇద్దరూ ప్రతి సంవత్సరం రూ.6,000.. 6,000.. మొత్తం 12 వేలను పొందగలరా?..

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం ఇచ్చింది. పిఎం కిసాన్ యోజన ప్రయోజనం విడివిడిగా.. ఏ ఒక్కరికీ అందించరు.. మొత్తం కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందుతుంది. అటువంటి పరిస్థితిలో, పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందడానికి భార్యాభర్తలు ఇద్దరూ దరఖాస్తు చేసినప్పుడు, దరఖాస్తులలో ఒకటి మాత్రమే ఆమోదిస్తారు. ఒకవేళ ఇద్దరి ఖాతాలో నగదు జమ అయితే.. ఒకరు ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలను రైతులందరూ పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత ప్రకారం.. లబ్ధిదారుల ఎంపిక.. ఆ తర్వాత వాయిదాల చెల్లింపు జరుగుతుంది.




