రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కి ప్రీమియం సెగ్మెంట్‌లో గత రెండేళ్లుగా ఎదురే లేకుండా పోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ 1,96,635 బైకులు అమ్మగలిగింది. ఆ తర్వాత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ ఉన్నా 2,10,270 బైకులు అమ్మింది. దాదాపు 7 శాతం వృద్ధిని అమ్మకాల్లో సాధించింది. సెప్టెంబరులో ఒక్కసారిగా అమ్మకాలు 52 శాతం మేర పడిపోయాయి.