- Telugu News Photo Gallery Business photos Rules Change: Key Changes In Insurance Sector, NPS, Gas Cylinder, Mutual Funds, Gold Hallmark From April 1, 2023
Rules Change: బంగారు అభరణాల నుంచి గ్యాస్ సిలిండర్ వరకు మారనున్న నిబంధనలు ఇవే..
మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ 1, 2023 నుంచి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి ఏప్రిల్ 1, 2023 నుంచి పలు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. ఆ నిబంధనలు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ పనులు చేస్తే మీరు తర్వాత ఈ మార్పుల గురించి ఆందోళన చెందాల్సిన ...
Updated on: Apr 01, 2023 | 7:08 AM

మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ 1, 2023 నుంచి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి ఏప్రిల్ 1, 2023 నుంచి పలు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. ఆ నిబంధనలు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గ్యాస్ ధరలు: అలాగే ప్రతీ నెలా 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మార్చి 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచింది. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.350 మేర పెరిగింది. మరి ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

బంగారం కొనుగోలుకు కొత్త నిబంధనలు: మీరు బంగారం కొనడానికి లేదా అమ్మడానికి వెళ్తున్నట్లయితే ఈ వార్త మీకు ముఖ్యమైనది. బంగారం, బంగారు ఆభరణాల కొనుగోలు, అమ్మకం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. 31 మార్చి 2023 తర్వాత, కొత్త హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులను విక్రయించలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల హాల్‌మార్క్‌లు మాత్రమే ఆమోదించబడతాయి. ఆరు అంకెల హాల్‌మార్క్ లేకుండా బంగారం గానీ, అభరణాలు గానీ కొనుగోలు, అమ్మకం సాధ్యం కాదు.

మ్యూచువల్ ఫండ్స్‌లో మార్పులు: ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లకు కేంద్రం షాకిచ్చింది. ఇక నుంచి డెట్ ఫండ్ ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తించవని స్పష్టం చేసింది. ఆర్థిక బిల్ 2023కి సవరణల ప్రతిపాదనలకు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. సవరణల ప్రకారం 35 శాతం కన్నా ఎక్కువ ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గానే పరిగణిస్తారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటే PFRDA, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ నియమం ఉపసంహరణకు సంబంధించినది. డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు సభ్యులు కొన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలను అప్‌లోడ్ చేయకుండా NPS నుండి ఉపసంహరణ సాధ్యం కాదు. మీరు ఇప్పుడు KYC పత్రాలను అందించాలి. పత్రాలలో ఏదైనా తప్పులు ఉంటే, మీ డబ్బు నిలిపివేయబడుతుంది.





























