- Telugu News Photo Gallery Business photos Redmi note 10t 5g smartphone to launch in india on july 20
Redmi Note 10T 5G: రెడ్మీ నోట్ 10టి స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల తేదీ ఖరారు.. అద్భుతమైన ఫీచర్స్
Redmi Note 10T 5G: కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లో చాలా రకాల స్మార్టు ఫోన్లు విడుదలవుతున్నాయి. తాజాగా రెడ్‌మి నోట్ 10టి 5 జి రిలీజ్ తేదీ ఖరారైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్..
Updated on: Jul 13, 2021 | 10:19 PM

Redmi Note 10T 5G: కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లో చాలా రకాల స్మార్టు ఫోన్లు విడుదలవుతున్నాయి. తాజాగా రెడ్‌మి నోట్ 10టి 5 జి రిలీజ్ తేదీ ఖరారైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 20న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. రెడ్‌మి సంస్థ నుంచి వస్తోన్న మొట్టమొదటి 5 జి ఎనేబుల్ స్మార్ట్‌ఫోన్ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్‌మి నోట్ 10 సిరీస్‌కి కొనసాగింపుగా ఇది విడుదలవుతోంది. కాగా, జూలై 20న ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కార్యక్రమాన్ని సంస్థ అధికారిక యూట్యూబ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత ఇది అమెజాన్, ఎంఐ.కామ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానుంది.

రెడ్‌మి నోట్ 10టి 6.5 -అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డాట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20: 9 ఆస్పెక్ట్ రేషియో, 1100 నిట్స్ బైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది మాలి-జి 57 ఎంసీ 2 జిపియూతో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో పనిచేస్తుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. దీనిలోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 5 జి, 4 జి ఎల్‌టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, ఛార్జింగ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది.

కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 10 టి వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనిలో 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో ప్రత్యేకంగా 8MP స్నాపర్ కెమెరాను అందించింది.

అదేవిధంగా సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చేర్చింది. అయితే, రెడ్‌మి నోట్ 10 టి ధరను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఫోన్ రష్యా వేరియంట్‌తో సమానంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యన్ మార్కెట్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 19,990 ధర వద్ద లభించే అవకాశం ఉంది. ఇదే ధర వద్ద భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.



