- Telugu News Photo Gallery Business photos PM Kisan Samman Nidhi 17th installment will be released soon do e kyc like this
PM Kisan: రైతులకు అలర్ట్.. త్వరలోనే పీఎం కిసాన్ 17వ విడత సాయం.. అలా చేయకపోతే డబ్బులు రానట్టే..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ యోజన) కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఆర్థికసహాయం చేస్తున్న విషయం తెలిసిందే.. రైతులు ఇప్పటివరకు 16 వాయిదాల ప్రయోజనం పొందారు.
Updated on: May 07, 2024 | 4:43 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ యోజన) కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఆర్థికసహాయం చేస్తున్న విషయం తెలిసిందే.. రైతులు ఇప్పటివరకు 16 వాయిదాల ప్రయోజనం పొందారు. ప్రభుత్వం త్వరలో 17వ విడత (PM కిసాన్) నగదను విడుదల చేయబోతోంది. అంతకుముందు ఫిబ్రవరి 28న 16వ విడత సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. నివేదికల ప్రకారం దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ వాయిదాలను మే నెలాఖరులోగా లేదా జూన్ ప్రారంభంలో పొందే అవకాశం ఉంది. అయితే దీని గురించి.. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక ప్రయోజనం: దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద, దేశంలోని అర్హులైన రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6000 అందజేస్తుంది.

PM కిసాన్ తదుపరి విడత పొందడానికి e-KYC తప్పనిసరి: PM కిసాన్ యోజన లబ్ధిదారులు తదుపరి విడతను పొందాలనుకుంటే, e-KYCని చేయడం తప్పనిసరి. అందువల్ల, మీరు కూడా లబ్ధిదారులయితే ఈ ముఖ్యమైన పనిని ఇంకా పూర్తి చేయకపోతే, ఆలస్యం చేయకుండా ఈరోజే పూర్తి చేయండి. మీరు దీన్ని చేయకపోతే, మీరు PM కిసాన్ సమ్మాన్ యోజన 17వ విడత ప్రయోజనాన్ని పొందలేరు..

ప్రధాన మంత్రి కిసాన్ యోజన ఇ-కెవైసి ఎలా చేయాలి: ముందుగా పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకి వెళ్లాలి. దీని తర్వాత, ఇక్కడ మీరు 'e-KYC' ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాన్ని ఇక్కడ నమోదు చేయండి. దీని తర్వాత మీరు సమర్పించుపై క్లిక్ చేయాలి.. దీన్ని చేసిన తర్వాత మీ e-KYC విజయవంతంగా పూర్తయినట్లే..

మీరు ఇంకా e-KYCని పూర్తి చేయకుంటే, దాన్ని పూర్తి చేయడానికి మీరు మీ సమీప CSC కేంద్రానికి వెళ్లవచ్చు. ఇక్కడ బయోమెట్రిక్ ఆధారిత e-KYC ని చేయవచ్చు..

అంతేకాకుండా.. మీరు బ్యాంకుకు వెళ్లి కూడా ఇ-కెవైసిని కూడా పొందవచ్చు. ఇ-కెవైసి ఫారమ్‌ను పూరించడం.. దానికి ఆధార్ కార్డ్ కాపీని జోడించడం ద్వారా మీ ఇ-కెవైసి పూర్తచేయవచ్చు..




