- Telugu News Photo Gallery Business photos Petrol, diesel price cut: Per litre Rs 2 3 rate reduction is possible, know why
Petrol Price: వాహనదారులకు ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్ రేటు తగ్గించే ఛాన్స్.?
మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది.
Updated on: Sep 26, 2024 | 7:17 PM

గత ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసలు ఊసే లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించింది.

మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది.

ఇక కొద్దిరోజులు క్రితం, పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ మాట్లాడుతూ, 'చమురు మార్కెటింగ్ కంపెనీలు(OMC) ముడి చమురును ఎంతకాలం తక్కువ ధరకే ఇస్తాయో.. ఇంధన ధరలను తగ్గించడానికి పరిశీలించవచ్చునని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు(క్రూడాయిల్) రేట్లు భారీగా తగ్గడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' తెలిపింది.

భారత్ దిగుమతి చేసుకుని క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఈ ఏడాది మార్చిలో 83-84 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో కేంద్రం పెట్రోల్ లీటరుపై రూ. 2 తగ్గించింది. ఇక ఇప్పుడు బ్యారెల్ ధర 74 డాలర్లకు పడిపోయిందని ఇక్రా సంస్థ పేర్కొంది. దీంతో పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 2-3 చొప్పున తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.




