- Telugu News Photo Gallery Business photos Officials' actions against GST evaders.. Inspections for two months
GST: జీఎస్టీ ఎగవేతదారులపై ఉక్కుపాదం.. రెండు నెలల పాటు తనిఖీలు
వస్తుసేవల పన్ను(జీఎస్టీ)లో మోసాలు జరుగుతున్నాయి. పన్ను ఎగొట్టే వారిపై జీఎస్టీ శాఖ చర్యలకు దిగుతోంది. జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై జీఎస్టీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. టోక్స్ ఎగవేతదారులను పట్టుకునేందుకు జీఎస్టీ శాఖ అధికారులు దుకాణాలను సందర్శిస్తున్నారు..
Updated on: May 18, 2023 | 4:01 PM

వస్తుసేవల పన్ను(జీఎస్టీ)లో మోసాలు జరుగుతున్నాయి. పన్ను ఎగొట్టే వారిపై జీఎస్టీ శాఖ చర్యలకు దిగుతోంది. జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై జీఎస్టీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

మే 16 మంగళవారం నుంచి రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. టోక్స్ ఎగవేతదారులను పట్టుకునేందుకు జీఎస్టీ శాఖ అధికారులు దుకాణాలను సందర్శిస్తున్నారు.

మరిన్ని సంస్థలకు వెళ్లి పత్రాలను పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించి సన్నాహాలు పూర్తి చేశారు. జీఎస్టీ ఎగవేతపై దర్యాప్తులో పాల్గొన్న డీజీజీఐ, డీఆర్‌ఐ సంస్థలు ఇటీవల 11 వేల కోట్ల రూపాయల విలువైన 24 మంది బడా దిగుమతిదారుల ఎగవేతను పట్టుకున్నాయి.

2023 ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు 1.87 లక్షల కోట్ల రూపాయలు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు జరగడం ఇదే ప్రథమం.

ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,87,035 కోట్లు. వాటిల్లో సీజీఎస్టీ రూ.38,440 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.47,412 కోట్లు, ఐజీఎస్టీ రూ.89,158 కోట్లు ఉన్నాయి. ఐజీఎస్టీలో విదేశీ వస్తువుల దిగుమతిపై సుంకం రూ.34,972 కోట్లు ఉన్నాయి. విదేశీ వస్తువుల దిగుమతి సుంకం (సెస్) రూ.901 కోట్లతోపాటు మొత్తం సెస్ వసూళ్లు రూ.12,025 కోట్లు నమోదయ్యాయి.





























