Lenovo: లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌లు.. మార్కెట్లో విడుదల.. ధర ఫీచర్స్‌ వివరాలు ఇవే..!

టెక్​ దిగ్గజం లెనోవో స్మార్ట్​ఫోన్లతో పాటు ల్యాప్​టాప్, ట్యాబ్​​ మార్కెట్​లో దూసుకెళ్తోంది. తాజాగా, ఈ సంస్థ కొత్త ట్యాబ్‌లను విడుదల చేసింది. హై-ఎండ్ విభాగంలో ..

Subhash Goud

|

Updated on: May 28, 2021 | 3:23 PM

టెక్​ దిగ్గజం లెనోవో స్మార్ట్​ఫోన్లతో పాటు ల్యాప్​టాప్, ట్యాబ్​​ మార్కెట్​లో దూసుకెళ్తోంది. తాజాగా, ఈ సంస్థ కొత్త ట్యాబ్‌లను విడుదల చేసింది. హై-ఎండ్ విభాగంలో ప్యాడ్ ప్రో, మిడ్-రేంజ్ విభాగంలో ప్యాడ్ ప్లస్ 11, లో ఎండ్ విభాగంలో ప్యాడ్ 11లను విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లన్నీ స్నాప్‌డ్రాగన్ SoCs ప్రాసెసర్​తో పనిచేస్తాయి. విడుదలైన మూడింటిలో లెనోవో ప్యాడ్ ప్రో 2021 అత్యంత ఖరీదైన, శక్తివంతమైన టాబ్లెట్లు.

1 / 4
ఈ స్లిమ్​, లైట్​వెయిట్​ట్యాబ్​ 5.8 మి.మీ. సైజు గల ఈ టాబ్లెట్​ 485 గ్రాముల బరువు ఉంటుంది. ఈ టాబ్లెట్ దిగువన పోగో పిన్ కనెక్టర్​, సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్​ను చేర్చింది. ఈ డివైజ్​లో​ మొత్తం 6W అవుట్​పుట్స్​, డాల్బీ అట్మోస్ సపోర్ట్, నాలుగు JBL స్పీకర్లను జోడించింది. 90Hz హై రిఫ్రెష్ రేటు గల ఈ డివైజ్​ 11.5 అంగుళాల OLED డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఇది డిస్‌ప్లే డాల్బీ విజన్, హెచ్‌డిఆర్ 10కు అనుకూలంగా ఉంటుంది.

2 / 4
ఈ ప్యాడ్ ప్రో 2021 క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoCతో పనిచేస్తుంది. ఇందులో 8GB ర్యామ్‌, 128GB యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్​ని అందించింది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించింది. దీని ముందు భాగంలో, టోఫ్ లెన్స్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను కూడా చేర్చింది. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ గల ఈ ట్యాబ్లెట్​లో 8600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇది భారత మార్కెట్లో సుమారు రూ.25,500 ధర ఉండే అవకాశం ఉంది.

3 / 4
అలాగే లైనప్‌లోనే లెనోవో ప్యాడ్ ప్లస్ 11 పేరుతో విడుదలైన మిడ్​ రేంజ్​ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. టాప్ మోడల్ మాదిరిగా, దీనిలో కూడా క్వాడ్-స్పీకర్ సెటప్‌ను అందించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750 జి SoC పనిచేసే ఈ ట్యాబ్​లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ చేర్చింది. ఇందులో వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను చేర్చింది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0కి సపోర్ట్​ గల ఈ ట్యాబ్​ 7700 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ధర సుమారు రూ.18,200 లభిస్తుంది.

4 / 4
Follow us