Ravi Kiran |
Updated on: Sep 07, 2021 | 6:46 AM
తరచూ చెల్లింపులకు చెక్‌లను ఉపయోగించే కస్టమర్లు.. తమ ఖాతాలో ఎలప్పుడూ డబ్బులు ఉండేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగష్టు నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. చెక్ క్లియరెన్స్ శని, ఆదివారాల్లో కూడా చేయొచ్చు.
అందువల్ల కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్లలో ఎలప్పుడూ కనీస బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలి. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ కావచ్చు.. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
జూన్‌లో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమీక్ష నిర్వహిచారు. కస్టమర్ల సౌకర్యాన్ని మరింతగా పెంచేందుకు, వారంలోని అన్ని రోజులలో NACH సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ సదుపాయాన్ని ఆగష్టు 1, 2021 నుండి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నాచ్ సేవల నిబంధనలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో చెక్ క్లియరెన్స్ అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటాయి.