- Telugu News Photo Gallery Business photos India's Debt Crisis: Top 10 Most Indebted States Revealed Include Telugu States
India’s Debt: అప్పుల ఊబిలో టాప్-10 రాష్ట్రాలు.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో.. ఆర్బీఐ కీలక నివేదిక!
India's Debt: దేశంలో ఆయా రాష్ట్రాలు అప్పు ఊబిలో కూరుకుపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగినట్లు తెలిపింది. దేశంలో భారీ అప్పులతో టాప్ -10 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. అందులో ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం..
Updated on: Mar 07, 2025 | 1:46 PM

దేశంలో అనేక రాష్ట్రాల్లో అప్పుల భారీ పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది.

గత ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రాల అప్పులలో భారీ పెరుగుదల ఉందని ఆర్బీఐ చెబుతోంది. రాష్ట్రాల్లో అప్పుల భారీం దాదాపు 74% పెరుగుదల ఉందని చెబుతోంది.

2019 సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు రూ.47.9 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది రూ.83.3 లక్షల కోట్లకు పెరిగింది. 2024లో భారతదేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల గురించి వెల్లిడించింది. తమిళనాడు రూ. 8.3 లక్షల కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉంది.

అత్యంత అప్పుల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ అప్పు రూ. 7.7 లక్షల కోట్లు. ఇక 7.2 లక్షల కోట్ల అప్పులతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రూ. 6.6 లక్షల కోట్ల అప్పులతో నాల్గవ స్థానంలో ఉంది.

అలాగే 6 లక్షల కోట్లతో కర్ణాటక ఐదవ స్థానంలో ఉంది. భారతదేశంలో రాజస్థాన్ రూ. 5.6 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రూ. 4.9 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది.




