- Telugu News Photo Gallery Business photos Indian Railways: What is the punishment for pulling the chain to stop the train without any reason?
Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ ఒక్క పొరపాటు చేస్తే చిక్కుల్లో చిక్కుకున్నట్లే..!
Indian Railways: రైలు ప్రయాణంలో ఇలాంటి తప్పు చేయకపోవడం మంచిది. ప్రయాణంలో ఎలాంటి తప్పులు చేయవద్దనే విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ప్రయాణం చేసేటప్పుడు మీ లగేజీని ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా జాగ్రత్తగా ఉండండి. తెలియకుండా..
Updated on: Dec 04, 2025 | 6:10 PM

Indian Railways: చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ రైలు ప్రయాణంలో కొన్ని తప్పులు చేయవద్దనే విషయం చాలా మందికి తెలియదు. చిన్న పొరపాటే పెద్ద సమస్యగా మారవచ్చు. రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. రైల్వే నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు ఏదైనా పొరపాటు చేస్తే శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంటుందని గుర్తించుకోవాలి.

ముఖ్యంగా రైలులో చైన్ లాగడం. దీని గురించి అందరికి తెలిసే ఉంటుంది. కానీ కొందరు అనవసరంగా రైలులో చైన్ లాగినట్లయితే అందుకు శిక్షను, జరిమానాను అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రైల్లో ప్రయాణించేటప్పుడు అనువుగా ఉంది కదా అని మీ బ్యాగులు, ఇతర లగేజీని ఎక్కడపడితే అక్కడ తగిలిస్తే కూడా తప్పే అవుతుంది. ఇకపై అలా చేస్తే మీకు ఫైన్ తప్పదు. జరిమాననే కాకుండా శిక్ష కూడా పడవచ్చు. రైలును అత్యవసరంగా ఆపాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే చైన్ గురించి తరచూ రైల్లో ప్రయాణించేవారికి.. తెలిసే ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదా అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపేందుకు ప్రతి బోగీలోనూ ఒక చైన్ తో ప్రత్యేక ఏర్పాటును చేస్తుంది రైల్వే.

దీనిని లాగినప్పుడు ఆటోమేటిక్‌గా రైలుకు బ్రేకులు పడి ఆగిపోతుంటుంది. అయితే ఇప్పుడు ఈ చైన్ పద్ధతిని మార్చి, దాని స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ అమర్చారు. ఇది ఎరుపురంగులో ఉంటుంది. అంతేకాదు అది హ్యాండిల్‌ను పోలి ఉంటుంది. దీంతో ప్రయాణికులు దానికి బ్యాగులు, సెల్‌ఫోన్లు లాంటివి తగిలిస్తున్నారు. దీనివల్ల ఆ పరికరం ఆటోమేటిక్‌గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతుంది. కొన్ని రైళ్లలో చైన్ కూడా ఉటుంది.

ఇది చట్టరిత్యా నేరమని, ఇలాంటి నేరానికి పాల్పడితే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడుతుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు రైల్వే అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్రమైన నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం 1000 రూపాయిలు జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అందుకే రైలు ప్రయాణంలో ఇలాంటి తప్పు చేయకపోవడం మంచిది. ప్రయాణంలో ఎలాంటి తప్పులు చేయవద్దనే విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ప్రయాణం చేసేటప్పుడు మీ లగేజీని ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా జాగ్రత్తగా ఉండండి. తెలియకుండా చైన్‌కు బ్యాగులు తగిలించినట్లయితే రైలు ఆగిపోయే అవకాశం ఉంది. దీని వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి.




