కరోనా నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే భయంతో వలస కార్మికులు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ రైళ్లను నడపనున్నట్లు తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా 70 శాతం రైలు సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా అధికారులు నడుపుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు తగ్గించడంతో ఆయా రైళ్లతో రద్దీ భారీగా తగ్గింది.