- Telugu News Photo Gallery Business photos HDFC Bank launches special fixed deposit schemes with higher interest rates
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండు ప్రత్యేక డిపాజిట్ స్కీమ్స్‌లు.. మరి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ఖాతాదారుల కోసం రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లపై పరిమిత కాలంతో అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. 35 నెలల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరిన సాధారణ ప్రజలకు 7.2 శాతం..
Updated on: May 30, 2023 | 8:00 AM

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ఖాతాదారుల కోసం రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లపై పరిమిత కాలంతో అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. 35 నెలల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరిన సాధారణ ప్రజలకు 7.2 శాతం, 55 నెలల గడువుతో వస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.25 శాతం వడ్డీరేట్లు చెల్లిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ అందిస్తామని పేర్కొంది. తక్షణం కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని వివరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెచ్చిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో ఒకటి.. రెండేండ్ల 11 నెలల గడువు ఉంటుంది. దీనిపై సాధారణ ఖాతాదారులకు 7.20 శాతం, సీనియర్ సిటిజన్లకు 50 బేసిక్ పాయింట్లతో కలిపి 7.70 శాతం వడ్డీ అందిస్తుంది. మరో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకానికి నాలుగేండ్ల ఏడు నెలల గడువుతో ముగుస్తుంది. 55 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ ఖాతాదారులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది.

ఈ రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలతోపాటు ఇంకా ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు కూడా సవరించింది. ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మూడు నుంచి ఏడు శాతం వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.

ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్టంగా 7-7.20 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఇక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8-9 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నాయి.




