Mahindra Electric Cars: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. లాంచింగ్‌కు రెడీ అయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. లిస్ట్ ఇదే..
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకనుగుణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. కార్ల విషయానికి వస్తే ఇప్పటికే టాటా ఓ అడుగు ముందుందనే చెప్పాలి. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టైగోర్ ఈవీ వంటివి ఇప్పటికే మార్కెట్లో ప్రవేశ పెట్టింది. అలాగే మరిన్ని కార్లను లాంచింగ్ కి రెడీ చేసింది. అలాగే కియా, ఎంజీ, మెర్సిడెస్ వంటి బ్రాండ్లుకూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేశాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల రేస్ లో కాస్త వెనుకబడినట్లు కనిపించిన మహీంద్రా కంపెనీ ఇప్పుడు తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎక్స్‌యూవీ 400 పేరిట ఓ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో అందుబాటులో ఉండగా.. మరిన్ని మోడళ్లు లాంచ్ చేసేందుకు మహీంద్రా ప్రణాళిక చేసింది. వాటిలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫీచర్లున్నాయి. త్వరలో లాంచ్ కానున్న మహీంద్రా కంపెనీకి సంబంధించిన టాప్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5