- Telugu News Photo Gallery Business photos Growing interest in Auto Expo, Queue of top companies to unveil their models, Auto Expo 2025 details in telugu
Auto Expo 2025: ఆటో ఎక్స్‌పోపై పెరుగుతున్న ఆసక్తి.. తమ మోడల్స్ ఆవిష్కరణకు టాప్ కంపెనీల క్యూ
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ ఆటో ఎక్స్‌పో పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండు వేరియంట్స్‌లో స్కూటర్లు, బైక్‌లు రిలీజ్ కానున్నాయి. అలాగే టాప్ కంపెనీల కార్లు కూడా ఆటో ఎక్స్‌పోకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆటో ఎక్స్‌పో లాంచ్ కానున్న టాప్ స్కూటర్లు, బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Jan 17, 2025 | 3:30 PM

ఏథర్ కంపెనీ కూడా ఆటో ఎక్స్‌పోలో తన నయా మోడల్ స్కూటర్‌ను ప్రదర్శించనుంది. ఏథర్‌కు సంబంధించిన లైనప్‌కు ఎంట్రీ పాయింట్ రిజ్టా ఎస్ స్కూటర్‌తో పాటు 450 అపెక్స్ స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచనుంది. రిజ్టా ఎస్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షలు, అయితే 450 అపెక్స్ మోడల్ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా ఉంది.

హోండా తన ఈ ఆటో ఎక్స్‌పో రెండు ఈవీ స్కూటర్లను ప్రదర్శించనుంది. యాక్టివా ఈతో పాటు క్యూసీ1ను లాంచ్ చేస్తుంది. యాక్టివా ఈ స్కూటర్ 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 102 కి.మీ మైలేజ్ ఇస్తుంది. స్థిర బ్యాటరీతో వచ్చే క్యూసీ 1 స్కూటర్ 80 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ స్కూటర్ల ధరలను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుతం ఉన్న మాగ్నస్ ఎక్స్ స్థానంలో ఆంపియర్ కంపెనీ మాగ్నస్ నియో పేరుతో సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది . మాగ్నస్ నియో చూడడానికి ఇతర స్కూటర్ల మాదిరిగా ఉన్నా డ్యూయల్-టోన్ పెయింట్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్ 2.3 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. అలాగ ఆంపియర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 80 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో బ్రాండ్ కొత్తగా ప్రారంభించిన మాగ్నస్ నియోతో పాటు దాని ఇతర ఆఫర్‌లను ప్రదర్శించే అవకాశం ఉంది.

బీఎండబ్ల్యూ కంపెనీ అప్‌డేటెడ్ ఎస్ 1000ఆర్ఆర్‌తో పాటు ఆర్ 1300 జీఎస్ఏలను విడుదల చేయనుంది. సూపర్‌స్పోర్ట్ రీడిజైన్ చేసిన ఫెయిరింగ్, వింగ్‌లెట్‌లను ఈ బైక్ ప్రత్యేకతగా ఉంటుంది. ఆర్ 1300 జీఎస్ఏ ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌తో పాటు రాడార్-సహాయకమైన వాటితో పాటు బీఎండబ్ల్యూకు సంబంధించిన ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్‌తో వస్తుంది. అందవల్ల ఈ మోడల్‌లో ఫిజికల్ క్లచ్ లివర్ ఉండదు. అయితే ఈ రెండు బైక్‌ల ధరలు అధికారికంగా ప్రకటించలేదు.

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో రెండు బైక్‌లు విడుదల చేయబోతోంది. ఎక్స్ పల్స్ 210, కరిజ్మా ఎక్స్ఎంఆర్‌ను విడుదల చేస్తుంది. అయితే ఎక్స్ పల్స్ 210 ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్స్ పల్స్ 200 కంటే రూ. 20,000 నుంచి రూ. 30,000 ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.




