- Telugu News Photo Gallery Business photos EV scooters at a lower price than iPhone, The best EV, Best electric scooters details in telugu
Best electric scooters: ఐఫోన్ కంటే తక్కువ ధరకు ఈవీ స్కూటర్లు.. ది బెస్ట్ ఇవే..!
ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ లభిస్తున్నకొద్దీ సరికొత్త ఫీచర్లతో వివిధ మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు పెరుగుతున్నప్పటికీ ధరలు మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా కొనుగోలు చేసే స్థాయిలో ఉంటున్నాయి. ఉదాహరణకు ఇటీవలే ఐఫోన్ ప్రో మాక్స్ ఫోన్ విడుదలైంది. ధీనిధర రూ.1.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. శక్తివంతమైన ప్రాసెసర్, నాణ్యత కలిగిన కెమెరా, స్పష్టమైన డిస్ ప్లే తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఐఫోన్ ప్రో మాక్స్ ధరకు మనకు మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
Updated on: Sep 24, 2024 | 5:15 PM

ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.17 లక్షలు. దీన్ని చార్జింగ్ చేయడానికి సుమారు 9 గంటలు పడుతుంది. దీనిలో 5.4 కేడబ్ల్యూ మోటారు, 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 90 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

అప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్ వేగం గంటకు 100 కిలోమీటర్లు. 160.03 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 7600 ఆర్పీఎం వద్ద 10.86 బీహెచ్పీ, 6000 ఆర్ఫీఎం వద్ద 11.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ గేర్ బాక్స్ జత చేశారు. ఈ స్కూటర్ రూ.1.30 లక్షలకు అందుబాటులో ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఓలాకు ఎంతో డిమాండ్ ఉంది. ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తితో మోటారు పనిచేస్తుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంగా పరుగులు తీస్తుంది. కేవలం 2.6 సెకన్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

రివర్ ఇండీ స్కూటర్ ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సుమారు ఐదు గంటలలో దాదాపు 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 120 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం 90 కిలోమీటర్లు. దీనిలో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ లో 2.2, 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఇవి రెండూ 4 కేడబ్ల్యూ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని చార్జింగ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది. 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం కూడా గంటకు 75 కిలోమీటర్లే. ఇక 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని చార్జింగ్ చేయడానికి నాలుగు గంటలన్నర పడుతుంది. దాదాపు 100 కిలోమీటర్ల రేంజ్ తో గంటకు 78 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్ ఫోరూమ్)




