- Telugu News Photo Gallery Business photos Citroen launches new electric car in india electric E C3 price and features See Pics
Citroen E-C3: భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర రూ. 11 లక్షలు, రేంజ్ 320 కిలోమీటర్లు..
భారత మార్కెట్లోకి సిట్రోన్ ఈ-సీ3 కారు వచ్చేసింది. రూ. 11.5 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ కారులో కొన్ని ప్రత్యేక స్మార్ట్ ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి వేరియంట్స్ ఉన్నాయి.? పూర్తి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Feb 28, 2023 | 9:35 PM

సిట్రోన్ ఈ-సీ3 కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. రూ. 11.5 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ కారును మొత్తం 4 వేరియంట్స్‌లో లాంచ్ చేశారు. దేశంలోని 25 నగరాల పరిధిలో 29 మైసాన్ సిట్రోన్ షోరూమ్స్‌లో అందుబాటులో ఉంది.

ధర విషయానికొస్తే లైవ్ వేరియంట్ రూ.11,50,000, ఫీల్ వేరియంట్ రూ. 12,13,000, ఫీల్ వైబ్ ప్యాక్ ధర రూ. రూ.12,28,000, ఫీల్ డ్యుయల్ టోన్ వైబ్ పాక్ రూ.12,43,000గా ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు 29.2 కిలోవాట్ల బ్యాటరీతోపాటు పర్మినెంట్ మాగ్నెస్ సింక్రోనస్ మోటార్ కలిగి ఉంది. 56 బీహెచ్పీ విద్యుత్, 143 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు కేవలం 6.8 సెకన్లలోనే 60 కి.మీ వేగం అందుకుంటుంది.

320 కి.మీ. రేంజ్ ప్రయాణ సామర్థ్యం ఉంటుందని ఏఆర్ఏఐ సర్టిఫికెట్ ఉంది. ఈ కారులో మై సిట్రోన్ కనెక్ట్, సీ బడ్డీ యాప్‌లు కనెక్టివిటీ ఉంది.

ఇక డ్రైవింగ్ బిహేవియర్ అనాలిసిస్, వెహికల్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కాల్, ఆటో క్రాష్ నోటిఫికేషన్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ కారు ప్రత్యేకతలు.




