Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

Bank Holidays in March 2023: మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూత పడనున్నాయి.

Ravi Kiran

|

Updated on: Mar 01, 2023 | 8:53 AM

మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూత పడనున్నాయి. మీకు బ్యాంక్ పనులు ఉన్నట్లయితే.. ఆ సెలవుల జాబితా ఏంటో తెలుసుకుని.. ముందస్తుగా ప్లాన్ సిద్దం చేసుకోండి. అప్పుడు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు పూర్తవుతాయి.

1 / 5
ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారాలు రెండు ఉండగా.. మరో ఆరు పండుగ రోజులు వచ్చాయి.

ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారాలు రెండు ఉండగా.. మరో ఆరు పండుగ రోజులు వచ్చాయి.

2 / 5
వెరిసి మార్చి నెలలో మొత్తంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా ఉండనున్నాయి. ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా..

వెరిసి మార్చి నెలలో మొత్తంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా ఉండనున్నాయి. ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా..

3 / 5
జాతీయ సెలవులు లిస్టు ఇలా:  

మార్చి 5: ఆదివారం, మార్చి 11: రెండో శ‌నివారం, మార్చి 12: ఆదివారం, మార్చి 19: ఆదివారం, మార్చి 25: నాలుగో శనివారం, మార్చి 26: ఆదివారం

జాతీయ సెలవులు లిస్టు ఇలా: మార్చి 5: ఆదివారం, మార్చి 11: రెండో శ‌నివారం, మార్చి 12: ఆదివారం, మార్చి 19: ఆదివారం, మార్చి 25: నాలుగో శనివారం, మార్చి 26: ఆదివారం

4 / 5
పండుగ సెలవులు ఇలా: 

 మార్చి 3 శుక్రవారం(చుప్‌చార్ కుట్‌-త్రిపుర రాజ‌ధాని అగ‌ర్తల‌లో సెల‌వు), మార్చి 7: మంగ‌ళ‌వారం(హోలీ - బెలాపూర్‌, గువాహ‌టి, తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌, డెహ్రడూన్‌, జైపూర్‌, జ‌మ్ము, కాన్పూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో,ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, రాంచీ, శ్రీన‌గ‌ర్‌ల‌లో సెల‌వు), మార్చి 8: బుధ‌వారం(హోలీ -అగ‌ర్తల‌, ఐజ్వాల్‌, అహ్మదాబాద్‌, భోపాల్‌, భువ‌నేశ్వర్‌, ఛండీగ‌ఢ్‌,  గ్యాంగ్‌ట‌క్‌, ఇంపాల్‌, కాన్పూర్‌, ల‌క్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లాల్లో సెల‌వు), మార్చి 9: గురువారం(హోలీ – పాట్నా), మార్చి 22: బుధ‌వారం(తెలుగు సంవ‌త్సరాది, ఉగాది, బీహార్ దివ‌స్‌), మార్చి 30: గురువారం- శ్రీ‌రామ‌న‌వ‌మి

పండుగ సెలవులు ఇలా: మార్చి 3 శుక్రవారం(చుప్‌చార్ కుట్‌-త్రిపుర రాజ‌ధాని అగ‌ర్తల‌లో సెల‌వు), మార్చి 7: మంగ‌ళ‌వారం(హోలీ - బెలాపూర్‌, గువాహ‌టి, తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌, డెహ్రడూన్‌, జైపూర్‌, జ‌మ్ము, కాన్పూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో,ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, రాంచీ, శ్రీన‌గ‌ర్‌ల‌లో సెల‌వు), మార్చి 8: బుధ‌వారం(హోలీ -అగ‌ర్తల‌, ఐజ్వాల్‌, అహ్మదాబాద్‌, భోపాల్‌, భువ‌నేశ్వర్‌, ఛండీగ‌ఢ్‌, గ్యాంగ్‌ట‌క్‌, ఇంపాల్‌, కాన్పూర్‌, ల‌క్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లాల్లో సెల‌వు), మార్చి 9: గురువారం(హోలీ – పాట్నా), మార్చి 22: బుధ‌వారం(తెలుగు సంవ‌త్సరాది, ఉగాది, బీహార్ దివ‌స్‌), మార్చి 30: గురువారం- శ్రీ‌రామ‌న‌వ‌మి

5 / 5
Follow us