- Telugu News Photo Gallery Business photos Bumper offer for Ather EV scooter lovers, benefits up to Rs.20 thousand, Ather EV Scooters details in telugu
Ather EV Scooter: ఏథర్ ఈవీ స్కూటర్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.20 వేల వరకు ప్రయోజనాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్య తరగతి ప్రజలు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్ల తయారీని ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఏథర్ తన అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది.
Updated on: Dec 20, 2024 | 3:30 PM

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఈ స్కూటర్ సొంతం చేసుకుంది. ఏథర్ కంపెనీ ఏథర్ 450, ఏథర్ రిజ్తా, ఏథర్ 450 అపెక్స్ స్కూటర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీకు అనుగుణంగా అమ్మకాలను పెంచుకునేందుకు ఈ నెలలో ఏథర్ స్కూటర్లను కొనుగోలు చేసే వారికి రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.

ముఖ్యంగా బ్యాటరీ వారెంటీను పొడగిస్తూ ఏథర్ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏథర్ ఈవీ స్కూటర్ కొనుగోలుపై కాంప్లిమెంటరీగా రూ. 5,000 విలువైన తన ఎయిక్ట్-70 బ్యాటరీ వారంటీ అందిస్తుంది. ఎనిమిదేళ్ల కవరేజీలో వచ్చే ఈ వారెంటీ బ్యాటరీ హెల్త్ 70 శాతం కంటే తక్కువగా ఉంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ వారెంటీ వస్తుంది.

ఏథర్ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్ తగ్గింపులను కూడా అందిస్తుంది.

ఏథర్ రిజ్తా ధర రూ. 1.09 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఏథర్ 450ఎస్ ధర రూ. 1.15 లక్షలు కాగా, 450ఎక్స్ ధర రూ.1.40 లక్షలు. ఏథర్ ఫ్లాగ్లిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ 450 అపెక్స్ ధర రూ. 1.94 లక్షలుగా ఉంది.




