- Telugu News Photo Gallery Business photos Budget bikes with super features, Amazing features with low maintenance cost, Budget Bikes details in telugu
Budget Bikes: సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ బైక్స్.. తక్కువ నిర్వహణ ఖర్చుతో అద్భుతమైన ఫీచర్లు
భారతదేశంలో పెరిగిన రవాణా సాధనాల నేపథ్యంలో బైక్‌లు అనేవి తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లడానికి బైక్ అనేది తప్పనిసరైంది. గతంలో కేవలం సైకిళ్లపై ఆధారపడేవారు ప్రస్తుతం బైక్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ బైక్స్ డిమాండ్ పెరిగింది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్‌తో సహా అనేక ద్విచక్ర వాహన తయారీదారుల నుండి 150 సీసీ విభాగంలో అనేక తక్కువ మెయింటెనెన్స్ బైక్‌లు అందిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో కొనుగోలు చేయడానికి ఐదు తక్కువ-మెయింటెనెన్స్ బైక్‌లను ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Feb 03, 2024 | 9:30 AM

97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌తో ఆధారితమైన హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటి. ఈ మోటార్‌సైకిల్ నిర్వహణ వ్యయం రెండేళ్లకు దాదాపు రూ.2,750గా అంచనా వేస్తున్నారు. హీరో స్ప్లెండర్ ధరలు రూ. 74,835 నుంచి రూ. 76,075 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

రూ. 64,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న హోండా షైన్ 100లో 7.2 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 98.98 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 2 సంవత్సరాలలో హోండా షైన్ 100కు సంబంధించిన అంచనా నిర్వహణ వ్యయం సుమారు రూ. 4,500గా ఉంది.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ 110 సీసీ, బీఎస్6 ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 8 హెచ్‌పీ శక్తిని, 8.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 77,770 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

బజాజ్ పల్సర్ 125 124.4 సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది 11.6 హెచ్‌పీ శక్తిని, 10.8 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ పల్సర్ 125 ధర రూ. 91,750 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. బజాజ్ పల్సర్ 125కు సంబంధించిన అంచనా నిర్వహణ వ్యయం 3 సంవత్సరాలకు రూ. 3,390గా ఉంటుంది.

97.2 సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వచ్చే హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ.62,862 నుంచి రూ.70,012 వరకు ఉంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌కు సంబంధించిన అంచనా నిర్వహణ వ్యయం 2 సంవత్సరాలకు సుమారు రూ. 2,500గా ఉంది




