- Telugu News Photo Gallery Business photos Budget 2025 This budget special for farmers KCC limit may be 5 lakh
Budget 2025: ఈ బడ్జెట్‌లో కేంద్రం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పనుందా? రూ.5 లక్షలకు పెరగనుందా?
Budget 2025: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే పథకాలు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇచ్చే స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకం ప్రస్తుతం రూ.3 లక్షలు ఉండగా, దానిని వచ్చే బడ్జెట్‌లో రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది..
Updated on: Jan 22, 2025 | 9:17 PM

రానున్న బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచవచ్చు. దీనికి ముందు KCC పరిమితిలో చివరి మార్పు 2006-07 సంవత్సరంలో జరిగింది. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మరోసారి కిసాన్ క్రెడిట్ క ఆర్డు పరిమితిని పెంచవచ్చని భావిస్తున్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అలాగే కేసీసీ పరిమితిని పెంచితే రైతులకు వ్యవసాయం చేయడం సులభతరం అవుతుందని, విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం సుమారు 26 సంవత్సరాల క్రితం 1998 సంవత్సరంలో ప్రారంభించింది కేంద్రం. ఈ పథకం కింద, వ్యవసాయం, సంబంధిత పనులు చేసే రైతులకు 9 శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలు అందిస్తారు.

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం రుణంపై వసూలు చేసే వడ్డీపై 2 శాతం రాయితీని కూడా ఇస్తుంది. అదే సమయంలో మొత్తం రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా మరో 3 శాతం రాయితీ ఇస్తారు.

అంటే ఈ రుణాన్ని రైతులకు కేవలం 4 శాతం వార్షిక వడ్డీకే ఇస్తారు. జూన్ 30, 2023 నాటికి అటువంటి రుణాలు తీసుకున్న వారి సంఖ్య 7.4 కోట్లకు పైగా ఉంది. 8.9 లక్షల కోట్లకు పైగా బకాయిలు కనిపించాయి.




