- Telugu News Photo Gallery Business photos An electric kick to the EV market, Ola super scooters with a mileage of 320 kilometers, OLA EV Scooter details in telugu
OLA EV Scooter: ఈవీ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. 320 కిలోమీటర్ల మైలేజ్‌తో ఓలా సూపర్ స్కూటర్లు
భారతదేశంలో ఈవీ స్కూటర్ల రంగంలో ఓలా స్కూటర్లకు ఉన్న క్రేజ్ వేరు. దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో యూనిట్లపరంగా ఓలా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈవీ స్కూటర్లకు ప్రధాన సమస్య అయిన మైలేజ్ సమస్యను పరిష్కరించేలా ఓలా జెనరేషన్-3 స్కూటర్లను ఇటీవల లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓలా జెన్-3 స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 01, 2025 | 5:00 PM

ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త జెన్-3 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని శుక్రవారం ప్రారంభించింది. 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఎంట్రీ లెవెల్ ఎస్1 ఎక్స్ స్కూటర్ రూ.79,999కు అందుబాటులో ఉంది. 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో టాప్-టైర్ ఎస్1 ప్రో+ రూ.1,69,999కు అందుబాటులో ఉంది. ఓలా తాజా ఈవీ ఆపరేటింగ్ సిస్టమ్, 'మూవ్ ఓఎస్-5' ఆధారంగా ఈ స్కూటర్లను రూపొందించారు.

ఓలా జెన్-3 స్కూటర్లు మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ ఆధారంగా పని చేస్తాయి. ముఖ్యంగా గత మోడల్స్‌లో వాటిన హబ్ మోటర్స్‌ను భర్తీ చేసేలా వీటిని జెన్-3 స్కూటర్స్‌లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జెన్-3 స్కూటర్ మోటర్ డిజైన్ ఐదు రెట్లు ఎక్కువ సమర్థవంతమైనదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఓలా జెన్-3 స్కూటర్‌లు చైన్ డ్రైవ్‌తో పాటు ప్రీ-లూబ్రికేటెడ్ ఓ-రింగ్‌లతో వస్తుంది. గత మోడళ్లలో ఉపయోగించిన బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కాలం పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఓలా పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికత జెన్-3 లైనప్‌కు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సిస్టమ్ మోటారు నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్‌పై సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. అందువల్ల బ్రేక్ ప్యాడ్ జీవితకాలం రెట్టింపు అవుతుంది.

ఎంట్రీ-లెవల్ ఓలా ఎస్1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ లేదా 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్1 ఎక్స్+ ప్రత్యేకంగా 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఎస్1 ప్రో+ మోడల్ 320 కిమీ పరిధిని, గరిష్ట వేగం 141 కిలోమీటర్లు ఉంటుంది.





























