- Telugu News Photo Gallery Business photos Bsnl to discontinue 3 cheap and long validity recharge plans from 10 february
BSNL: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఫిబ్రవరి 10 నుంచి ఈ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఉండవు!
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు అందిస్తున్న ఈ మూడు చౌక ప్లాన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 10వ తేదీ నుంచి ఈ మూడు ప్లాన్స్ అందుబాటులో ఉండవు. 10వ తేదీ లోపు ఈ మూడు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవు..
Updated on: Feb 02, 2025 | 9:34 AM


భారత్ సంచార్ నిగమ్ నుండి వచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముఖ్యంగా కాల్ చేయడానికి మాత్రమే . ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముఖ్యంగా ఫీచర్ ఫోన్‌లను ఉపయోగించే సెకండరీ సిమ్‌గా BSNL నంబర్‌ను కలిగి ఉన్న వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కేవలం కాలింగ్ ప్లాన్ మాత్రమే. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం లేదు.

మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా వాడుతున్నట్లయితే బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మంచి ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ మీకు మంచి ఇంటర్నెట్ ప్యాక్‌ను అందిస్తుంది. BSNLకు చెందిన ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌లో మీరు అపరిమిత కాలింగ్ (భారతదేశంలో), ఉచిత SMS OTT సబ్‌స్క్రిప్షన్, 1000 GB కంటే ఎక్కువ డేటాను పొందుతారు. మీరు అపరిమిత ప్రయోజనాలను పొందుతున్న బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

TRAI నిబంధనల ప్రకారం.. వాయిస్ కాలింగ్, మెసేజింగ్ కోసం మాత్రమే కంపెనీ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు డేటా ప్రయోజనాన్ని పొందలేరు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రైవేట్ కంపెనీల కంటే తక్కువ ధరకు వస్తుంది.

ఫిబ్రవరి 10లోపు రీఛార్జ్ చేసుకోండి: మీరు BSNL కస్టమర్ అయితే, ఈ ప్లాన్‌లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించాలనుకుంటే మీకు ఫిబ్రవరి 10 వరకు సమయం ఉంది. ఈ లోపు ఈ ప్లాన్స్‌ను రీఛార్జ్ చేసుకుంటే ప్రయోజనాలు పొందుతారు. ఆ తర్వాత ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవు. దీనికి ముందు మీరు ఈ ప్లాన్‌లతో మీ BSNL నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఇలా చేస్తే ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి.





























