AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉడకబెట్టిన గుడ్డు – ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?

గుడ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను గుడ్లు అందిస్తాయి. మీరు వాటిని ఉడికించి తినవచ్చు లేదా ఆమ్లెట్‌గా తినవచ్చు. మీరు అల్పాహారంగా గుడ్లు తినాలనుకుంటే, వాటిని ఉడికించాలా లేదా ఆమ్లెట్ వేసుకోవాలా..? ఆరోగ్యానికి ఏది మంచిది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 30, 2025 | 2:32 PM

Share
గుడ్లు అత్యంత పోషక విలువలున్న ఆహారాలలో ఒకటి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్‌ఫుడ్స్ అని పిలుస్తారు. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. అయితే, గుడ్లను ఉదయం అల్పాహారంగా తీసుకునేటప్పుడు ఉడికించిన గుడ్డు తినాలా లేదా ఆమ్లెట్ వేసుకోవాలా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది.

1 / 5
గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ మీ అల్పాహారంలో గుడ్లను చేర్చుకుంటే ఇంకా మంచిది. గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

2 / 5
ఆమ్లెట్ : 
ఆమ్లెట్‌ను మీ అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. మీరు తక్కువ నూనెతో సాదా ఆమ్లెట్ వేసుకుంటే, ఉడికించిన గుడ్డు మాదిరిగానే పోషకాలు లభిస్తాయి. కానీ ఆమ్లెట్‌లో ఉల్లిపాయలు, టమాటాలు, పుట్టగొడుగులు వంటి కూరగాయలు జోడించడం ద్వారా అదనపు ఫైబర్, సూక్ష్మపోషకాలను పొందవచ్చు. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు వైవిధ్యమైన రుచిని, ఆకృతిని ఆస్వాదించవచ్చు. అలాగే గుడ్డు పచ్చసొన లేకుండా కేవలం తెల్లసొనతో ఆమ్లెట్ చేసుకుంటే అది మరింత తేలికైన ఆహారంగా మారుతుంది.

ఆమ్లెట్ : ఆమ్లెట్‌ను మీ అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. మీరు తక్కువ నూనెతో సాదా ఆమ్లెట్ వేసుకుంటే, ఉడికించిన గుడ్డు మాదిరిగానే పోషకాలు లభిస్తాయి. కానీ ఆమ్లెట్‌లో ఉల్లిపాయలు, టమాటాలు, పుట్టగొడుగులు వంటి కూరగాయలు జోడించడం ద్వారా అదనపు ఫైబర్, సూక్ష్మపోషకాలను పొందవచ్చు. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు వైవిధ్యమైన రుచిని, ఆకృతిని ఆస్వాదించవచ్చు. అలాగే గుడ్డు పచ్చసొన లేకుండా కేవలం తెల్లసొనతో ఆమ్లెట్ చేసుకుంటే అది మరింత తేలికైన ఆహారంగా మారుతుంది.

3 / 5
ఏది మంచిది..? : మీరు కేలరీలు తక్కువగా ఉండే, అదనపు కొవ్వులు లేని ఆహారాన్ని కోరుకుంటే ఉడికించిన గుడ్డు ఉత్తమ ఎంపిక. మీరు మరింత రుచికరమైన, పోషకాలతో నిండిన అల్పాహారం కోరుకుంటే తక్కువ నూనెతో కూరగాయలు వేసి చేసుకునే ఆమ్లెట్ మంచి ఎంపిక. రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఎంచుకోవడం కంటే, రెండింటినీ కలిపి తీసుకోవడం ఇంకా మంచిది. ఎలా తిన్నా గుడ్డులో ఉండే ప్రోటీన్ మన కండరాల ఆరోగ్యానికి, కణజాలాల మరమ్మత్తుకు చాలా ముఖ్యమైనది.

4 / 5
గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, ఆరోగ్యవంతులకు ఇది పెద్ద సమస్య కాదు. పచ్చసొనలో విటమిన్ ఏ, డి, ఈ, కె తో పాటు ఫోలేట్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కంటి చూపు, ఎముకల ఆరోగ్యం, మెదడు పనితీరుకు తోడ్పడతాయి. అందుకే గుడ్లను మీ రోజువారీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ

చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!