నేటి 'డిజిటల్ ఇండియా' యుగంలో ఇంట్లోనే రక్తపోటును స్వయంగా కొలుచుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఇవి తప్పుగా బీపీ చూపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి అర్థం కాదు. కాబట్టి బీపీ ఖచ్చితంగా కొలవడానికి కొన్ని నియమాలను అనుసరించాలి. బీపీ కొలిచేటప్పుడు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మోచేయి పైన చేతితో బ్రాచియల్ ఆర్టరీని గుర్తించడం. స్టెతస్కోప్ డయాఫ్రాగమ్‌ను సరైన చోట ఉంచడం. డయాఫ్రమ్‌ను గుడ్డపై ఉంచినట్లయితే, డయాఫ్రమ్ - గుడ్డ యొక్క ఘర్షణ కారణంగా ధ్వని వినడం కష్టం అవుతుంది. డిజిటల్ యంత్రాన్ని ఉపయోగించినప్పటికీ, బ్రాచియల్ ఆర్టరీని కఫ్ చేయాలి.