మీకు ఒత్తుగా, పొడవైన జుట్టు కావాల్నా.. జస్ట్ ఈ నూనెలు అప్లై చేయండి.. జింగ్ జింగ్ అమేజింగే..
ఫాస్ట్‌లైఫ్, మారుతున్న ఆహారపు అలవాట్లు, పనిభారం కారణంగా ఇటీవల రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమన్య జుట్టురాలడం( ఎయిర్‌ఫాల్). దీన్ని తగ్గించుకోవడం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రస్తుతం చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో రోజూ జుట్టుకు నూనె పెట్టడం కూడా ఒకటి. అయితే జుట్టు ఆరోగ్యం కోసం ఎలాంటి నూనెలు వాడాలి, ఏ సమయంలో వాడాలో చాలా మందికి తెలియదు. కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరిచే నూనెల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 18, 2025 | 3:55 PM

కొబ్బరి నూనె: మనకు ఊహ తెలిసినప్పటి నుంచి జుట్టు సంరక్షణ కోసం అందరూ ఉపయోగించే నూనె ఇదే. కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోతుంది, అంతేకాకుండా ఇది ప్రోటీన్ లోపాన్ని తల్లగిస్తుంది. జుట్టు విచ్ఛిన్నం కాకుండా చూస్తుంది. ఇది చుండ్రుతో కూడా పోరాడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను వేడి చేసి జుట్టుకు రాసుకొని ఉదయం షాంపూతో తల స్నానం చేయడం ద్వారా మీ జుట్టుకు ఆరోగ్యంగా ఉంటుంది. దృడంగా ఉంటుంది.

ఆముదం నూనె: ఆముదం నూనె కూడా జుట్టు పెరుగుదలకు మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో రిసినోలిక్ ఆమ్లం, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆలాగే ఇది జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది

ఆమ్లా నూనె: ఆమ్లా (ఉసిరి) నూనెలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఇది జుట్టును బలంగా మార్చడానికి సహాయపడుతుంది, అంతేకాకుండా జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఆమ్లా నూనెను తలకు బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించండి.

ఆలివ్ నూనె: ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఈ నూనె జుట్టును లోతుగా కండిషన్ చేస్తుంది, వెంట్రుకలు చిట్లడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొద్దిగా ఆలివ్ నూనెను వేడి చేసి, తలకు, జుట్టుకు బాగా మసాజ్ చేసి, రాత్రంతా అలాగే ఉంచండి. తర్వాత ఉదయం తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.

ఉల్లిపాయ నూనె: జుట్టు పెరుగుదలకు ఉల్లి నూనె కూడా మంచి ఎంపిక. ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఈ నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టును వెగంగా పెరిగేలా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఉల్లిపాయ నూనెను మీ తలకు అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం తేలికపాటి షాంపూ ఉపయోగించి మీ జుట్టును శుభ్రంచేసుకోండి. ఇవి మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




