Best South Indian Beaches: సముద్రతీర అందాలను వీక్షించాలుకుంటున్నరా.. అయితే దక్షణ భారతదేశంలో బెస్ట్ బీచ్‌లు ఇవే..
వేసవిలో టూర్‌కి వెళ్లాలని చాలామంది ప్లాన్లు వేసుకుంటారు. అలాంటివారు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బీచ్‌లను సందర్శించవచ్చు. బీచ్‌లతో పాటు వీటి చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాలను వీక్షించవచ్చు. మరి సౌత్ ఇండియాలో అలాంటి టూరిస్ట్ ప్లేస్‌లు చాలానే ఉన్నాయి. మీరు తప్పకుండ ఈ బీచ్‌లను చూడండి.
Updated on: Apr 19, 2023 | 3:39 PM

వేసవిలో టూర్‌కి వెళ్లాలని చాలామంది ప్లాన్లు వేసుకుంటారు. అలాంటివారు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బీచ్‌లను సందర్శించవచ్చు. బీచ్‌లతో పాటు వీటి చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాలను వీక్షించవచ్చు. మరి సౌత్ ఇండియాలో అలాంటి టూరిస్ట్ ప్లేస్‌లు చాలానే ఉన్నాయి.మీరు తప్పకుండ ఈ బీచ్‌లను చూడండి.

రామకృష్ణ బీచ్: విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నిరంతరం పర్యాటకులతో కళకళలాడడుతుంది. ఇక్కడ సూర్యాస్తమయాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో పలు దేవాలయాలు కూడా ఉన్నాయి.

కోవలం బీచ్: కేరళలోని కోవలం బీచ్ దక్షిణ భారత్‌లోని ప్రముఖ బీచ్‌ల్లో ఒకటి. ఇక్కడి నీరు కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది.

కన్యాకుమారి బీచ్: తమిళనాడులోని కన్యాకుమారి బీచ్ ప్రకతి అందాలకు పెట్టింది పేరు. అరేబియా సముద్ర అందాలను, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి ఇక్కడికి పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు.

కొచ్చి: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కొచ్చి ఒకటి. ఇక్కడ బీచ్‌తో పాటు చెరాయ్ బీచ్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, మట్టంచెర్రీ ప్యాలెస్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు.

కాలా పత్తర్ బీచ్: అండమాన్, నికోబార్‌లో కొలువై ఉన్న ఈ బీచ్ చుట్టూ ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. కొత్తగా పెళ్లైనవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.

చెన్నైలోని ఇలియట్ బీచ్: చెన్నైలోని ఇలియట్ బీచ్ ఎంతో అందంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ఇది చెన్నై నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ చుట్టూ పలు దేవాలయాలు కూడా ఉన్నాయి.

ఓం బీచ్: కర్ణాటకలోని గోకర్ణలోని ఓం బీచ్‌కు టూరిస్ట్‌ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇది సాంస్కృతికంగా, చారిత్రకంగా కూడా ఎంతో పేరు పొందింది.




