AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot For Hair: పొడిబారి నిర్జీవంగా మారిన జుట్టుకు బీట్‌రూట్‌తో ఇలా ప్రాణం పోయండి..

చలికాలంలో చర్మమే కాదు, జుట్టు కూడా డల్ అవుతుంది. అందువల్లనే ఈ కాలంలో జుట్టు సంరక్షణ కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. నిర్జీవంగా మారిని జుట్టుకు తిరిగి ప్రాణం పోసేందుకు చాలా మంది పార్లర్‌కు పరుగులు తీస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం రాకపోగా.. డబ్బు కూడా ఖర్చవుతుంది. ఈ విషయంలో బిట్ సహాయం చేస్తుంది. పొడి జుట్టుకు చికిత్స చేయడంలో బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇది చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది..

Srilakshmi C
|

Updated on: Feb 08, 2024 | 7:03 PM

Share
చలికాలంలో చర్మమే కాదు, జుట్టు కూడా డల్ అవుతుంది. అందువల్లనే ఈ కాలంలో జుట్టు సంరక్షణ కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. నిర్జీవంగా మారిని జుట్టుకు తిరిగి ప్రాణం పోసేందుకు చాలా మంది పార్లర్‌కు పరుగులు తీస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం రాకపోగా.. డబ్బు కూడా ఖర్చవుతుంది.

1 / 5
ఈ విషయంలో బిట్ సహాయం చేస్తుంది. పొడి జుట్టుకు చికిత్స చేయడంలో బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇది చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలకు బీట్‌రూట్ సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సహజమైన రీతిలో జుట్టుకు బలాన్ని అందించడంలో ఇది సహాయపడుతుంది.

2 / 5
బీట్‌ రూట్‌ను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా దుంపలను బాగా కడగాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని జ్యూసర్‌లో వేసి జ్యూస్‌ తీసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని జుట్టు మూలాలకు బాగా పట్టించాలి.

3 / 5
ఒక్క వెంట్రుక కూడా మిస్ కాకుండా తలంతా పట్టించాలి. తర్వాత ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో టవల్ ముంచాలి. నీటిని బాగా పిండి, దానిని తలకు చుట్టుకోవాలి. ఇలా 15 నుండి 20 నిమిషాల పాటు తడి టవల్‌ను చుట్టుకుని, ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

4 / 5
 ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు మాయమవడం మాత్రమే కాకుండా జుట్టు బలంగా మారుతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఫలితాన్ని మీరే చూస్తారు.

5 / 5