- Telugu News Photo Gallery Beauty tips these five fruits juices can be a best treatment for many skin problems and pimple face
Beauty Care Tips: మొహంపై మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ పండ్లతో చెక్ పెట్టొచ్చు..
Beauty Care Tips: యుక్త వయస్సులో చాలామంది మొహంపై మొటిమలతో బాధపడుతుంటారు. అయితే.. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి మీరు పండ్ల రసాల సహాయం కూడా తీసుకోవచ్చు. వాటిని సరిగ్గా చర్మంపై అప్లై చేస్తే.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే పలు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Updated on: Feb 28, 2022 | 8:49 AM

చర్మ సంరక్షణ కోసం, ముఖంపై మొటిమలు దూరం చేసేందుకు మీరు ఏయే పండ్ల రసాలను ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

క్యారెట్ జ్యూస్: క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి క్యారెట్‌ను ముఖానికి అప్లై చేస్తే.. మెరిసే అందం మీ సొంతం అవుతుంది. ముందు క్యారెట్ రసాన్ని తీసి అందులో దూదిని నానబెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేసిన 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఉసిరి రసం: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరి రసం చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. ఈ రసాన్ని వారానికి రెండు సార్లు ముఖానికి పట్టిస్తే మంచిది.


దానిమ్మ రసం: ఈ పండులో విటమిన్ సి మాత్రమే కాకుండా అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే చాలామంచిది. అయితే అప్లై చేసేటప్పుడు మీ చర్మం రకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే.. ఈ రసంలో ముల్తానీ మిట్టిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

స్ట్రాబెర్రీ జ్యూస్: మీరు టానింగ్ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. దాన్ని వదిలించుకోవడానికి మీరు స్ట్రాబెర్రీ జ్యూస్‌ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రసాన్ని చర్మంపై సుమారు 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. కావాలంటే దీనికి పెరుగు కూడా జోడించవచ్చు.





























