- Telugu News Photo Gallery Beauty Tips: How Can Raisins Water Improve Skin? Here Are 5 Benefits You Should Know
Skincare Tips: మెరిసే చర్మం కోసం బెస్ట్ ఎంపిక ఎండు ద్రాక్ష.. ఎలా ఉపయోగించాలంటే..
చాలా మంది తమ చర్మ సంరక్షణ కోసం రకరకాల కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే అవి ఎప్పుడూ పరిపూర్ణమైన రిజల్ట్ ఇవ్వవు. కాంతులీనే చర్మాన్ని ఇవ్వవు. దీంతో సహజ పదార్థాలు స్కిన్ కేర్ కోసం బెస్ట్ ఎంపిక.
Updated on: Aug 13, 2023 | 1:11 PM

ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. అనేక రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఎండుద్రాక్షలో నానబెట్టిన నీటిలో విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, రాగి వంటి పోషకాలు ఉంటాయి.

ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొక్కల ఆధారిత ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి సౌకర్యాన్ని అందిస్తుంది. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు మన శరీరంలో డిటాక్స్ వాటర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్యాలను బయటకు పంపుతుంది. ఇది మొటిమల సమస్యలను తగ్గిస్తుంది.

ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఈ డిటాక్స్ వాటర్ డ్రై, డల్ స్కిన్‌కి ప్రాణం పోస్తుంది. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడుతుంది.

మొటిమల నొప్పి , వాపు, ఎర్రటి మచ్చలు, దద్దుర్లు చర్మం మంట వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే.. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మాత్రమే సంభవిస్తాయి. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు చర్మంపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఈ సమస్యలను తగ్గిస్తుంది.

ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు జిడ్డు చర్మం సమస్యను దూరం చేస్తుంది. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు చర్మంపై అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది మొటిమలు, ఓపెన్ రంధ్రాల సమస్యను తగ్గిస్తుంది.

ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. కొత్త కణాలు ఏర్పడతాయి. నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడమే కాకుండా ఎండుద్రాక్షలో నానబెట్టిన నీటిని కూడా ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు.





























