పెళ్లిలో అందంగా కనిపించాలా.. అయితే ఈ అమ్మమ్మల కాలం నాటి టిప్స్ పాటించాల్సిందే!
కార్తీక మాసం ప్రారంభమైందంటే చాలు, పెళ్లి భజాలు మోగిపోతాయి. పెళ్లి ముహుర్తాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది పవిత్రమై కార్తీక మాసంలో ఎక్కువగా వివాహాలు జరిపిస్తుంటారు. ఇక వివాహం సమయంలో పెళ్లి కూతురు అందంగా కనిపించడానికి మార్కెట్‌లో ఏవో ఏవో ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి ఏవీ లేకుండా, ఇంటిలోని ఈ పదార్థాలు స్క్రబ్ తయారు చేసుకొని, అప్లై చేసుకోవడం వలన మంచి గ్లో వస్తుందంట. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Nov 09, 2025 | 9:06 AM

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక అందమైన జ్ఞాపకం. అందుకే ఆ రోజూ చాలా ప్రత్యేకంగా, అందంగా కనిపించాలనుకుంటుంది. దీన కోసం బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదై ప్రొడక్స్ట్ కొనుగోలు చేసి ఇబ్బంది పడుతుంటారు. కానీ అవి ఏవీ లేకుండా, మన అమ్మమ్మల కాలంలో వాడిన సహజ స్క్రైబ్స్‌తో వివాహ వేడుకలో చాలా స్పెషల్‌గ కనిపించవచ్చునంట. దాని గురించి తెలుసుకుందాం పదండి.

పసుపు, శనగ పిండి, గంధం, పాలు, బాదం వంటి పదార్థాలను ఉపయోగించి, స్క్రబ్ తయారు చేసుకొని వాడటం వలన ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరచి, సహజ మెరుపును ఇస్తుందంట. వివాహానికి పది రోజుల ముందు నుంచి దీనిని ఉపయోగించడం వలన ఇది ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుందంట. పసుపులోని యాంటీ ఇన్ ఫ్లమెంటరీ , యాంటీ సెప్టిక్ లక్షణాలు పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, గంధం చర్మంలోని రంధ్రాలను మూసి ముడతలను తగ్గిస్తుంది. సహజ నిగారింపునిస్తుంది.

మొటిమలు తగ్గ, చర్మం మృదువు గా అందంగా తయారు కావాలి అంటే దానికి వేప, కలబంద స్క్రబ్ బెస్ట్ అంట. వేపకులను శుభ్రపరచి, వాటిని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. తర్వాత ఆ పొడిని కలబంద జెల్‌తో కలిపి ముఖానికి అప్లై చేయడం వలన ఇది చర్మాన్ని శుభ్ర పరిచి, మొటిమలను తొలిగించి, చర్మం సాప్ట్‌గా అయ్యేలా చేస్తుందంట.

బాదం ఆరోగ్యానికే కాదండోయ్, అందానికి కూడా చాలా ఉపయోగపడుతుందంట. కొత్త పెళ్లి కూతుర్లు, బాదం పప్పులను పాలల రాత్రి నానబెట్టి, తర్వాత వాటిని తొక్క తీసి, పచ్చి పాలల్లో వేసి, కాస్త రుబ్బుకొని, స్క్రబ్ తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వలన ఇది టాన్ తొలిగించి, చర్మానికి సహజ మెరపునిస్తుంది.

Bridal Beauty Tips 3



