Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basil Seeds: తులసి గింజలతో రోగాలు మటుమాయం!.. వృద్ధాప్య ఛాయల్ని తొలగించే అద్భుత ఔషధం!! ఎలాగంటే..

తులసి గింజల వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విత్తనాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిల్లో ఐరన్, ఫైబర్, ప్రొటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. తులసి గింజల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 5:22 PM

తులసీ విత్తనాలు జలుబు, దగ్గు నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుంది. తులసి గింజలను డికాక్షన్‌లో కలుపుకుని కూడా తీసుకొవచ్చు. ఈ డికాషన్ జలుబు, దగ్గు నుండి త్వరగా బయటపడటానికి సహాయపడుతుంది.  ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని బయటకు తీసేయటంలో ఇది పనిచేస్తుంది.  మారుతున్న సీజన్లలో ఈ సమస్య తరచుగా ఎదురవుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో తులసి గింజలతో చేసిన కషాయాలను తరచూ తీసుకోవటం ఆరోగ్యానికి మేలు.

1 / 5
తులసి గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. శరీరానికి కావలసిన పోషకాలను (Nutrients) అందించి బరువును తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి.

2 / 5
తులసి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను నివారిస్తుంది.   మలబద్ధకం, అజీర్ణం, విరేచనాలను నివారించడానికి పనిచేస్తుంది.  మీరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలతో తులసి గింజలను తినవచ్చు.

3 / 5
తులసి గింజలను నమిలి తింటే దంతాలలో పేరుకుపోయిన బ్యాక్టీరియా నశించి దంత సమస్యలు (Dental Problems) దూరమవుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5
మెదడు పనితీరును మెరుగుపరచడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని (Tulasi juice) కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి  పెరుగుతుంది.

5 / 5
Follow us