Barmer District Collector: పిల్లల క్రియేటివిటీని మెచ్చుకున్న కలెక్టర్.. ఆ ఊరికి వరమిచ్చి వెళ్లారు.. ఇంతకీ వాళ్లు ఏంచేశారంటే..!
ఒకవైపు పిల్లలు మొబైల్, ఇంటర్నెట్‌కు బానిసలవుతుంటే.. ఆ పిల్లలు మాత్రం తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. ఆటల్లోనే వారి కళలను ప్రదర్శిస్తుంటారు.
Barmer District Collector Appreciations to Children: ఒకవైపు పిల్లలు మొబైల్, ఇంటర్నెట్‌కు బానిసలవుతుంటే.. ఆ పిల్లలు మాత్రం తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. ఆటల్లోనే వారి కళలను ప్రదర్శిస్తుంటారు. పిట్టగూడులు కట్టి ఆటలాడుకుంటున్న పిల్లలను ఓ జిల్లా కలెక్టర్ మెచ్చుకుని నగదు బహుమతి కూడా ఇచ్చారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఇందుకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లాలోని ఓ చిన్నగ్రామం. ఆ జిల్లా కలెక్టర్ అయిన శివప్రసాద్ నకటే ఆ గ్రామం గుండా వెళుతూ.. రోడ్డు పక్కనే ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని చూసి …తన కారును ఆపారు. ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్లి వారు బురద మట్టితో కట్టిన ఇళ్లను పరీక్షించి చూశారు. ఆ చిన్నిచిన్ని ఇళ్లు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటిని ఇంటిని కలుపుతూ రాళ్లతో రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. పిల్లల క్రియేటివిటీని మెచ్చుకున్న జిల్లా కలెక్టర్.. వారికి 500 రూపాయలు బహుమతిగా ఇచ్చి వెళ్లారు.
అలా తన కారులో కాస్త ముందుకు వెళ్లాక.. కలెక్టర్ ఆలోచనల్లో పడ్డాడు. పిల్లలు కట్టిన ఇళ్లులు వాటికి వేసిన రోడ్లు పదే పదే గుర్తువస్తున్నాయి. నిజమే కదా ఇది పిల్లలు ఆడుకున్న ఆట కాదు. వారి ఆశ.. వారి అవసరం.. అని గుర్తించి వెంటనే ఆ ఊరికి వెళ్లిన పరిసరాలను పరిశీలించారు. దీంతో ఆ గ్రామానికి కరనీసం రోడ్డు కూడా సరిగాలేదు. దీంతో వెంటనే ఊరికి రోడ్డును మంజూరు చేయించారు.
కాగా, దీనిపై బర్మార్ జిల్లా కలెక్టర్ శివప్రసాద్ నకటే స్పందిస్తూ.. పిల్లలు కట్టిన తమ చిన్ని ఇళ్ల ముందు కూడా ఒక రహదారిని వేశారు. ఇది పిల్లల ఉహకు నిదర్శనం. ఇది హృదయాన్ని తాకింది. అంతేకాకుండా ప్రస్తుతం ఆన్‌లైన్ గేమ్స్‌కే పరిమితమవుతున్న పిల్లలు ఇలా సృజనాత్మకంగా ఆలోచించడం కట్టిపడేసింది. అందుకే వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే వారికి నగదు బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చారు.
నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి
పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..