పొటాషియంతో పాటు, అరటి పండ్లలో విటమిన్లు A, C, ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అరటిపండ్లలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అరటిపండ్లు తింటే కూడా కంటి చూపు మెరుగవుతుంది. అరటిపండ్లు తినడం వల్ల జీర్ణ రుగ్మతలు, ముఖ్యంగా మలబద్ధకం వంటి వాటిని నివారించవచ్చు. అయితే అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వారు వైద్యుల సలహా మేరకు తీసుకుంటే మంచిది.