Independence Day: మారిన రూల్స్.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ముందు ఈ నియమాలను తెలుసుకోవాల్సిందే..

Independence Day: కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌లో పలు మార్పులు చేసింది. ఆజాదీ అమృత్ ఉత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

|

Updated on: Jul 27, 2022 | 7:23 AM

Independence Day: కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌లో పలు మార్పులు చేసింది. ఆజాదీ అమృత్ ఉత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జెండా ఎగురవేయడానికి సంబంధించిన నిబంధనలను మార్చారు.

1 / 5
కొత్త రూల్స్ ప్రకాం రాత్రిపూట కూడా జెండా ఎగురవేయవచ్చు. జెండా ఎగురవేసేందుకు కాలపరిమితి లేదు. కొత్త ఫ్లాగ్ కోడ్ గురించి తెలియజేస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు. గతంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జెండాను ఎగురవేసేందుకు అనుమతి ఉండేది.

2 / 5
ఇప్పటి వరకు పాలిస్టర్ వస్త్రంతో తయారు చేసిన జెండాలను నిషేధించారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు జాతీయ జెండాను యంత్రంతో తయారు చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు జెండాలను కూడా ఎగురవేయవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన, యంత్రంతో తయారు చేసిన జెండాలు రెండింటినీ ఇప్పుడు ఎగురవేయవచ్చు.

3 / 5
జెండాకు సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. జెండాపై ఏదైనా రాయడం చట్టవిరుద్ధం. త్రివర్ణ పతాకాన్ని ఏ వాహనం, విమానం. ఓడ వెనుక ఇష్టానుసారంగా ప్రదర్శించకూడదు. ఇది ఏ వస్తువులు, భవనాలు మొదలైనవాటిని కవర్ చేయడానికి ఉపయోగించబడదు.

4 / 5
పాత మార్గదర్శకాల ప్రకారం త్రివర్ణ పతాకం నేలను తాకకూడదు. త్రివర్ణ పతాకాన్ని ఏ ఇతర జెండా కంటే తక్కువ ఎత్తులో ఎగురవేయకూడదు. త్రివర్ణ పతాకాన్ని ఎలాంటి అలంకరణకు ఉపయోగించరాదు. త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. దీని నిష్పత్తి 3:2గా నిర్ణయించడమైంది. తెల్లటి బార్ మధ్యలో ఉన్న అశోక చక్రం తప్పనిసరిగా 24 అరలను కలిగి ఉండాలి.

5 / 5
Follow us