Ayurvedic Tips: చర్మంపై నల్లటి మచ్చలా.. తమలపాకుతో ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి
చలికాలంలో కాలుష్యం బాగా పెరిగింది. కాలుష్యం కారణంగా ముఖంపై నల్లమచ్చలు ఏర్పడడం సర్వసాధారణం. అయితే ఈ నల్ల మచ్చలు అందాన్ని తగ్గిస్థాయి. దీంతో ఈ నల్ల మచ్చలను తగ్గించుకోవడానికి వివిధ రకాల స్క్రబ్స్ ,బ్లాక్ హెడ్స్ రిమూవల్ వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తారు.
Updated on: Jan 15, 2024 | 11:01 AM

చలికాలంలో చాలా మంది క్రీమ్ అప్లై చేసుకుని బయటికి వెళ్తారు. అప్పుడు ఆ క్రీమ్ మీద దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోక పొతే స్కిన్ సమస్య పెరుగుతుంది

వాతావరణంలో వచ్చిన మార్పుల్లో భాగంగా చర్మ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాదు రోజువారీ అలవాట్ల కూడా స్కిన్ సమస్య పెరగడానికి కారణం అవుతుంది. ముఖంపై ఎక్కువ రసాయనాలను ఉపయోగించినా చర్మానికి మరింత హాని కలుగుతుంది. ఎక్కువ మంది క్రీములు, లోషన్లు వాడుతున్నారు. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. అదే సమయంలో ఫేషియల్స్ , బ్లీచింగ్ వలన చర్మానికి చాలా నష్టం జరుగుతుంది.

చలికాలంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. కాలుష్యం కారణంగా ముఖంపై నల్లమచ్చలు పెరిగిపోతున్నాయి. తెరుచుకున్న రంధ్రాలే సమస్య. చలికాలంలో అందరూ క్రీమ్ వేసుకుని బయటికి వెళ్తారు. ఇప్పుడు ఆ క్రీమ్ మీద రోజంతా దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే, సమస్య పెరుగుతుంది

ఇలాంటి సమస్యలకు తమలపాకులతో చెక్ పెట్టండి. తమలపాకులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఒక ప్లేట్‌లో నీరు వేసి చిటికెడు పసుపు వేసి రెండు తమలపాకులను రాత్రంతా నానబెట్టాలి. ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

మరుసటి రోజు ఉదయం పసుపును నీళ్లలోంచి తీసి తమలపాకులను రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకుల పేస్టులో చెంచా నీళ్లలో కలిపి వడకట్టాలి. తమలపాకు రసాన్ని రెండు వేరు వేరు గిన్నెలలో ఉంచండి. ఒక గిన్నెలో 2 చెంచాల బియ్యం పొడి , పసుపు వేసి బాగా కలపండి

ఫేస్‌ప్యాక్ సిద్ధంగా ఉంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించేందుకు ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. నల్ల మచ్చలు కూడా అదృశ్యమవుతాయి. ఈ చిట్కాను నెలరోజుల పాటు రోజూ చేయండి. ఈ పేస్ట్ ముఖంపై అప్లై చేసి ఆరిపోయే వరకు వేచి ఉండండి. ఎండిపోయిన తర్వాత తడి గుడ్డతో తుడవండి

ముఖంపై టాన్ పెరిగితే మిగిలిన తమలపాకు రసంలో ఒక చెంచా అలోవెరా జెల్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. చక్కటి క్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయాలి

ఈ తమలపాకు నల్ల మచ్చలను తొలగించడంలో మంచి సహకారిగా పనిచేస్తుంది. ఖరీదైన క్రీముల కంటే మెరుగ్గా పని చేస్తుంది. రోజూ తమలపాకులతో ఈ చిట్కాలను చేయడం వలన చాలా బాగా పని చేస్తుంది. 10 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత ముఖం కడుక్కోవాలి.




