- Telugu News Photo Gallery If there is iron deficiency in the body these are the symptoms, check details in Telugu
Foods for Iron deficiency: శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. కనిపించే లక్షణాలు ఇవే జాగ్రత్త!
శరీర అభివృద్ధికి, ఆరోగ్యానికి ఖనిజాలు అనేవి చాలా అవసరం. చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. దానికి తోడు ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్స్, మినరల్స్ సరిగ్గా అందడం లేదు. దీంతో జబ్బుల బారిన పడుతున్నారు. శరీర నిర్మాణంలో అవసరమైన వివిధ రకాల పోషకాల్లో ఐరన్ కూడా అతి ముఖ్యం. ఐరన్ లోపం ఉంటే చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఐరన్ లోపంతొ సమస్యల్ని..
Chinni Enni | Edited By: Janardhan Veluru
Updated on: Jan 15, 2024 | 12:15 PM

శరీర అభివృద్ధికి, ఆరోగ్యానికి ఖనిజాలు అనేవి చాలా అవసరం. చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. దానికి తోడు ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్స్, మినరల్స్ సరిగ్గా అందడం లేదు. దీంతో జబ్బుల బారిన పడుతున్నారు.

శరీర నిర్మాణంలో అవసరమైన వివిధ రకాల పోషకాల్లో ఐరన్ కూడా అతి ముఖ్యం. ఐరన్ లోపం ఉంటే చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఐరన్ లోపంతొ సమస్యల్ని ఎందుర్కొంటున్నారు.

ఐరన్ కొరత కారణంగా శరీరంలో తీవ్రంగా రక్త హీనత ఏర్పడి, రక్తంలో కణాలు తగ్గి పోతున్నాయి. శరీరంలో ఐరన్ లోపం కారణంగా కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముందే మీరు వాటిని గుర్తిస్తే.. రక్త హీనత సమస్య ఏర్పడదు. జాగ్రత్తగా ఉండొచ్చు.

హార్ట బీట్ వేగంగా మారిపోతుంది. ఏ పనీ చేయలేకపోతారు. అలసటగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. జుట్టు అదే పనిగా రాలుతూ ఉంటుంది. కళ్లు, ముఖం పేలవంగా మారిపోతాయి. ముఖంపై కాంతి తగ్గుతుంది. కంటి కింద తెల్లని చారలు కనిపిస్తూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.

ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మీ డైట్ లో డ్రై ఫ్రూట్స్, పాలు, ఐరెన్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి. ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మేలు.





























