- Telugu News Photo Gallery What are the benefits of walking for 30 minutes every day? check here is details in Telugu
Walking in Winter: ప్రతి రోజూ 30 నిమిషాలు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో!
వాకింగ్, జాగింగ్, వ్యాయామం ఇలా ఉదయం ఏది చేసినా.. చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, అధిక బరువు వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. హెల్దీగా ఉండాలంటే.. వాకింగ్ చాలా బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ శీతాకాలంలో ప్రతి రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల అనేక సమస్యలను అదుపు చేయవచ్చని..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 15, 2024 | 1:20 PM

వాకింగ్, జాగింగ్, వ్యాయామం ఇలా ఉదయం ఏది చేసినా.. చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, అధిక బరువు వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. హెల్దీగా ఉండాలంటే.. వాకింగ్ చాలా బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ శీతాకాలంలో ప్రతి రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల అనేక సమస్యలను అదుపు చేయవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

రోజుకు 30 నిమిషాలు నడవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయ పడుతుంది. పొట్ట కొవ్వ కరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

నడవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరచడంలో, ఆందోళన తగ్గించడంలో సహాయ పడుతుంది.

మీ హృదయ స్పందన రేటును పెంచడానికి, కేలరీలను బర్న్ చేయడానికి వాకింగ్ అనేది గొప్ప మార్గంగా.. నిపుణులు చెబుతున్నారు. రోజూ 30 నిమిషాలు మితమైన వేగంతో నడవడం వల్ల 150 కేలరీలు అనేవి బర్న్ అవుతాయి.

ముఖ్యంగా రుతు క్రమం ఆగిపోయిన స్త్రీలు క్రమం తప్పకుండా నడవడం వల్ల.. పొత్తి కడుపులో ఉండే కొవ్వు నిల్వలు తగ్గుతాయి. 30 నిమిషాలు నడవలేని వారు కనీసం 15 నిమిషాలు నడిచినా.. ఆరోగ్యంగా ఉండొచ్చు.





























