- Telugu News Photo Gallery Cricket photos Pakistan Palyer Muhammad Rizwan Sets New Record For Sixes In T20 Cricket after 2nd match against New Zealand
T20 Cricket: చేసింది 7 పరుగులే.. అందులో ఓ సిక్సర్.. కట్‌చేస్తే.. స్పెషల్ రికార్డ్‌తో అగ్రస్థానం..
Muhammad Rizwan Six Record: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ జట్టు 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Updated on: Jan 15, 2024 | 12:55 PM

New Zealand vs Pakistan 2nd T20I: న్యూజిలాండ్‌తో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఏడు పరుగులలో ఒక సిక్సర్ ఉంది. ఈ సిక్స్‌తో రిజ్వాన్ పాకిస్థాన్ తరపున సరికొత్త రికార్డు సృష్టించాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్‌తో పాక్ తరపున టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ పత్రం మహ్మద్ హఫీజ్ పేరు మీద ఉండేది.

పాకిస్థాన్ తరపున 108 ఇన్నింగ్స్‌లు ఆడిన మహ్మద్ హఫీజ్ 76 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ రికార్డును మహ్మద్ రిజ్వాన్ బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర లిఖించాడు.

పాకిస్థాన్ తరపున 75 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన మహ్మద్ రిజ్వాన్ ఇప్పటివరకు 77 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రిజ్వాన్ రికార్డు సృష్టించాడు.

పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ జట్టు 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.




