ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, విషయాలు దాగున్నాయి.. అందుకే ప్రకృతి వైద్యం ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఆయుర్వేద మూలికా రహస్యాలు కూడా ఎన్నో సమస్యలకు దారిచూపుతాయి. అలాంటి వాటిల్లో అశ్వగంధ ఒకటి.. అశ్వగంధను అనేక రకాల ఆయుర్వేద ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఈ మొక్క పురుషుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. అశ్వగంధను ఇండియన్ జిన్సెంగ్.. వింటర్ చెర్రీ అని పిలుస్తారు.