ఏకధాటిగా గంటలకు గంటలు టీవీ చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. దూరంగా ఉండే వస్తువుల్ని స్పష్టంగా చూడలేకపోవడం, పుస్తకంలో అక్షరాలు కళ్లకు కనిపించకపోవడం వంటి పరిణామాలు తలెత్తుతాయి. ఎలక్ట్రానిక్ స్క్రీన్ నుంచివెలువడే నీలికాంతి వల్ల కంటి రెటీనాలో కొన్ని సున్నితమైన కణాలు అతిఉత్తేజితమవుతాయి. దీని వల్ల నిద్రలేమి, కలత వస్తుంది.