Basha Shek |
Updated on: Dec 03, 2022 | 2:21 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. జీరో సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అతను మళ్లీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు.
తాజాగా ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాను సందర్శించాడు షారుఖ్ ఖాన్. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'అల్లాహ్ షారుఖ్‌ను దీవించాలి' అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
3. షారుఖ్ ఖాన్ కుటుంబం గత కొంతకాలంగా కష్టాల్లో ఉంది. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. తర్వాత ఈ కేసు నుంచి బయటపడ్డాడు.
ఇక షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా హిట్ కావడం షారుఖ్‌కు ఎంతో ముఖ్యం. అందుకే సినిమా విడుదలకు ముందే మక్కా యాత్రకు వెళ్లాడు.
పఠాన్ సినిమాతో పాటు జవాన్, డంకీ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు షారుఖ్. కాగా షారుఖ్ మక్కాలో ఉమ్రా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఒక అభిమాని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.