- Telugu News Photo Gallery Are you drinking diet soda drinks? it is very danger, check details in Telugu
Diet Soda Drinks Side Effects: డైట్ సోడా డ్రింక్స్ ని తెగ తాగేస్తున్నారా.. అయితే మీరు డేంజర్ పడ్డట్లే!
ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ ఆధారంగా.. ఆహారంలో కూడా పలు రకాల మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా డైట్ సోడా డ్రింక్స్ ని తాగుతూంటారు. చాలా మంది ఇదో ఫ్యాషన్ గా భావిస్తూంటారు. నిజానికి వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయం మర్చి పోతున్నారు. డైట్ సోడా డ్రింక్స్ తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుందని, బరువు పెరగడం, డయాబెటీస్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Dec 17, 2023 | 12:15 PM

ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్ ఆధారంగా.. ఆహారంలో కూడా పలు రకాల మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా డైట్ సోడా డ్రింక్స్ ని తాగుతూంటారు. చాలా మంది ఇదో ఫ్యాషన్ గా భావిస్తూంటారు. నిజానికి వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయం మర్చి పోతున్నారు.

డైట్ సోడా డ్రింక్స్ తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుందని, బరువు పెరగడం, డయాబెటీస్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ డ్రింక్స్ లో ఉండే రసాయనాల వల్ల ఒక్కసారి తాగితే.. మళ్లీ మళ్లీ తాగాలనే కోరిక పుడుతుంది.

ముఖ్యంగా ఈ డైట్ కోక్ తాగితే కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోడాలు, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు ఆరోగ్యానికి హానికరమని రుజువయ్యాయి. ఇటీవల చాలా మంది జీరో షుగర్, జీరో క్యాలరీ పానీయాలకు అలవాటు పడుతున్నారు. వీటిని తరుచుగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం ఖాయమని నిపుణులు సూచిస్తున్నారు.

కాగా డైట్ సోడా డ్రింక్స్ లాంటివి ఎక్కువగా తాగడం వలన డిప్రెషన్ ను పెంచుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిల్లో కృత్రిమంగా తియ్యటి పానీయాలు, స్వీట్ నెర్ లు ఉంటాయని వీటి వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిపారు నిపుణులు.

డైట్ సోడా తాగడం వల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది సిర్రోసిస్ కు కారణం అవుతుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ డైట్ కోక్స్, సోడాలు వంటి వాటికి దైరంగా ఉండటమే బెటర్.





























